మహనీయుడు పొట్టి శ్రీరాములు
ABN, First Publish Date - 2022-12-16T00:23:27+05:30
పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరిం చుకుని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పిం చారు.
జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ
వాడవాడలా వర్ధంతి కార్యక్రమాలు
ఏలూరు రూరల్, డిసెంబరు 15 : పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరిం చుకుని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పిం చారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుకు ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఏఎస్పీ ఎస్‌ఎస్ శేఖర్, ఎస్పీ కార్యాలయం ఏవో సీహెచ్ గోపీనాధ్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరుటూటౌన్ : పొట్టి శ్రీరాములు త్యాగఫలితమే ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని టీడీపీ జిల్లా కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్ అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. నగర అధ్యక్షురాలు చవ్వా అరుణకుమారి, గుడిమెట్ల ప్రశాంతి, రవి, రవితేజ, చవ్వా శ్రీనివాస్, మురళీకృష్ణ, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు ఎడ్యుకేషన్ : ఏలూరులో సమగ్రశిక్ష జిల్లా కార్యాలయ ఆవరణలో అమరజీవి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించిన అనంతరం కాకినాడ ఆర్జేడీ డి. మధుసూదనరావు మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర సాధనకు శ్రీరాములు కృషి మరువరానిదన్నారు. సమగ్రశిక్ష సీఎంవో రవీంద్ర, సూపరింటెండెంట్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
భీమడోలు : తెలుగుదేశంపార్టీ భీమడోలు క్యాంపు కార్యాలయంలో శ్రీరాములు చిత్రపటానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పూల మాల వేసి నివాళులర్పించారు. కరణం పెద్దిరాజు, దూసపూడి పుల్లయ్యనా యుడు, శేషపు శేషగిరి, గంధం లక్ష్మణ్, కుక్కల ప్రసాద్, పద్మ పాల్గొన్నారు.
భీమడోలు మండల బీజేపీ ఆధ్వర్యంలో కార్యాలయంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. పార్టీ మండల అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ వల్లభాయ్‌పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. నాయకు లు ఇంటి ఉదయభాస్కర్, ఒంటెద్దు ఏసు వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కామవరపుకోట : స్థానిక చౌతనా సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు, జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాల సముదాయం వద్ద గురువారం చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ, మాజీ జడ్పీటీసీ ఘంటా సుధీర్‌బాబు, టీడీపీ ఏలూరు పార్లమెంటు కన్వీనర్ కొయ్యగూర వెంకటేష్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్య నాయకులు వందనపు మురళీ, వంకదార ఉదయ్, టీడీపీ నాయకులు పుల్లాజీ, థామస్, బోద అనీష్ నివాళులర్పించారు. రావిపాడులో కామవరపుకోట టీడీపీ మండల అధ్యక్షుడు కిలారు సత్యనారా యణ ఆధ్వర్యంలో శ్రీరాములు విగ్రహం వద్ద నివాళులర్పించారు.
చింతలపూడి : చింతలపూడి నగర పంచాయతీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో బోడా అనీష్‌కుమార్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. పి.వెంకటేశ్వరరావు, కొత్తపూడి శేషగిరిరావు, నత్తా రవి, మారుమూడి థామస్, మోరం ఈశ్వరకుమార్, సుబాని, టోకూరి యేబు, పాల్గొన్నారు.
పెదవేగి : పెదవేగిలో ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో మాజీ సర్పంచి తాతా సత్యనారాయణ ఆధ్వర్యంలో శ్రీరాములు శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు కొనకళ్ళ నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, బలరామకృష్ణ, పాపారావు, జి.గాంధీ పాల్గొన్నారు.
గణపవరం :గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో, పిప్పర శాఖ గ్రంథాల యంలో పొట్టి శ్రీరాములు వర్థంతిని కళాశాల ప్రిన్సిపాల్ పాకలపాటి నిర్మలకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. అధ్యాపకులు జి.వెంకట్రావు, చిన సత్యనారాయణ, అక్కిరాజు తదితరులు పాల్గొన్నారు. పిప్పర శాఖ గ్రంథాల యంలో అడ్వకేట్ గుడ్ల వెంకటకృష్ణారావు, గ్రంథపాలకుడు రంగారావు, పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల : ఆంధ్రరాష్ట్ర సాధనకై ప్రాణాలొడ్డిన శ్రీరాములు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని సర్పంచ్ కె.స్వర్ణలత కొనియాడారు. గరుడా ళ్వార్ కూడలిలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. కోరుప్రోలు సత్యనారాయణ, వైపీసీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T00:23:28+05:30 IST