ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు దర్బార్‌

ABN, First Publish Date - 2022-05-22T06:04:28+05:30

పోలీసు సిబ్బంది శారీర కంగా, మానసికంగా ధృడంగా ఉంటే ప్రజలకు మెరు గైన సేవలు అందించగలుగుతారని జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌శర్మ అన్నారు.

సమస్యలు వింటున్న ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్పీ దృష్టికి పోలీసుల సమస్యలు

ఏలూరు క్రైం, మే 21: పోలీసు సిబ్బంది శారీర కంగా, మానసికంగా ధృడంగా ఉంటే ప్రజలకు మెరు గైన సేవలు అందించగలుగుతారని జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌శర్మ అన్నారు. ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏఆర్‌ పోలీసు సిబ్బంది సమస్యలపై పోలీసు దర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహి ంచారు. ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ మాట్లాడుతూ ఏఆర్‌ సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తామని, సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తించి రాష్ట్రంలో ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ విభాగానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావా లన్నారు. నిరంతరం విధుల్లో ఉండే సిబ్బంది విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబ సభ్యులతో గడపాలన్నారు. వీరి కోసం  క్రీడలు, సాంస్కృతిక కార్యక్ర మాలు నిర్వహిస్తామన్నారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకు నేందుకు నిపుణులతో రీఫ్రెష్‌ కోర్సులు నిర్వహిస్తామన్నారు. యోగా, ధ్యానం, వ్యాయామంతో ఆరోగ్యాన్ని తీర్చిదిద్దుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మనోధైర్యంతో ఉండాలన్నారు.  కార్యక్రమంలో సిబ్బంది శాఖాపరంగా ఉన్న పలు అంశాలు, సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుం టామని హామీనిచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.చక్రవర్తి, ఏఆర్‌ అదనపు ఎస్పీ బి.రామకృష్ణ, డీఎస్పీ కృష్ణంరాజు, ఆర్‌ఐలు కృష్ణంరాజు, పవన్‌కుమార్‌ పలువురు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-22T06:04:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising