ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్వాసితుల సమస్యలు తక్షణం పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-01-22T05:10:49+05:30

నిర్వాసితుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని, వారి సమస్యలపై సీపీఐ అవిశ్రాంత పోరాటం చేస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ అన్నారు.

నిర్వాసితుల దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న డేగా ప్రభాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలవరం, జనవరి 21: నిర్వాసితుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని, వారి సమస్యలపై సీపీఐ అవిశ్రాంత పోరాటం చేస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ అన్నారు. 43వ రోజు నిరసన దీక్ష కొనసాగిస్తున్న  నిర్వాసితులకు శుక్రవారం ఆయన కలిసి సంఘీభావం తెలిపారు. పైడిపాక నిర్వాసితులు నీరుడు అబ్బులు, దొడ్డపాటి వీరవెంకట సత్యనారాయణ, కనమర్లపూడి నాగేశ్వరరావు తదితరుల కుటుంబాలకు అధికారులు న్యాయం చేయకపోవడం దారుణమన్నారు. నిర్వాసితులను మైదాన ప్రాంతాలకు తీసు కువచ్చి వదిలివేయడం సరికాదన్నారు. కుక్కునూరు మండలంలో రెండు పంచాయతీలను ముంపు గ్రామాలుగా గుర్తించకపోవడం అన్యాయమన్నారు. గిరిజన గ్రామాల ప్రజలు బతుకు తెరువులేక అవస్థలు పడుతున్నారని, సత్వరమే పరిహారం చెల్లించాలన్నారు. నిరసన దీక్షలలో బదిరెడ్డి శ్రీనివాస రావు, డేరా వెంకటేశ్వరరావు, మిడియం వెంకటస్వామి, కారం వెంకటేశ్వర రావు, శివాజీ  తదితరులు పాల్గొన్నారు.


సత్యసాయి కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలి


సత్యసాయి మంచినీటి పథకం కార్మికులకు వేతన బకాయిలపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని డేగా ప్రభాకర్‌ అన్నారు. వర్కర్స్‌ యూ నియన్‌ కార్మికులను కలిసి వారికి సంఘీభావం తెలిపారు. కార్మికులందిరికీ జీతాలు వస్తాయని, సత్యసాయి పథకం కొనసాగుతుందన్నారు. కార్మికులు వివిధ రకాలుగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని సూచించారు. ఎండి మన్నారు, కారం దారయ్య, సోదెం వెంకటేశ్వరరావు, పిట్టా వీరయ్య, సన్నేపల్లి సాయిబాబు, జల్లేపల్లి వెంకటనరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:10:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising