ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకమైంది: చంద్ర శేషు

ABN, First Publish Date - 2022-03-03T21:16:59+05:30

సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయం, సాగునీటి రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి/జంగారెడ్డిగూడెం: సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయం, సాగునీటి రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకమైందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో రైతు సంక్షేమ పథకాలు అమలయ్యాయని గుర్తుచేశారు. సాగునీటి ప్రాజెక్టులు పరుగులు పెట్టాయని, యుద్ధ ప్రాతిపదికగా పోలవరం పనులు జరిగాయని శేషు తెలిపారు. సోమవరాన్ని పోలవరంగా మార్చి ప్రాజెక్టు నిర్మాణాన్ని మాజీ సీఎం చంద్రబాబు పరుగులు పెట్టించారని పేర్కొన్నారు. 


జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతాంగం అవస్థలు వర్ణనాతీతమన్నారు. రాష్ట్రానికే అన్నపూర్ణలాంటి గోదావరి జిల్లాల్లో క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉభయగోదావరి జిల్లాల రైతులు గతంలో ఎన్నడూ లేని విధంగా అప్పుల ఊబిలో కూరుకుపోయారని తెలిపారు. 9 సార్లు సంభవించిన తుపాన్లతో కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సీడీని తగ్గించిందని, ఇన్సూరెన్సు కట్టడం మర్చిపోయిందని విమర్శించారు. ఎన్నో ఎళ్లుగా కొనసాగుతున్న ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేసి.. అధనపు అప్పుల కోసం కేంద్రం విధించిన షరతులకు తలొగ్గి.. విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని చంద్ర శేషు మండిపడ్డారు.

Updated Date - 2022-03-03T21:16:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising