ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం నిర్వాసితుల నిరసన

ABN, First Publish Date - 2022-08-17T06:22:01+05:30

పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, కొరుటూరు బాధితులకు వివాదాలు లేని భూములు అప్పగించి ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారాలు అంది వ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

జంగారెడ్డిగూడెం ఆర్‌డీవో కార్యాలయం ఎదుట వంట–వార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేస్తున్న నిర్వాసితులు, ప్రజాసంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్‌డీవో కార్యాలయం వద్ద వంట–వార్పు


జంగారెడ్డిగూడెం టౌన్‌, ఆగస్టు 16 : పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, కొరుటూరు బాధితులకు వివాదాలు లేని భూములు అప్పగించి ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారాలు అంది వ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆర్‌డీవో కార్యాలయం వద్ద వంటా–వార్పు నిర్వహించారు. గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఏ.రవి మాట్లాడుతూ 2014లో అప్పటి ప్రభుత్వం కొరుటూరు గ్రామస్థులకు జీలుగుమిల్లి మండలంలో భూమికి భూమి ఇస్తామని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం సకల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఆ హామీలు నెరవేర్చకపోవడం వల్ల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం కట్టించిన ఇళ్లల్లో వాన కురవడం, తినడానికి తిండిలేక, చేయడానికి పనిలేక నానాకష్టాలు పడుతున్నారన్నారు. నిర్వాసితులు మృతి చెందితే దహన సంస్కారాలకు కనీసం శ్మశానం కూడా లేదన్నారు. నిర్వాసితులు ఆర్‌డీవో కార్యా లయం ఎదుట భోజనాలు చేసి నిరసన తెలిపారు. ఈనెల 26న గ్రామాల్లో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తామని ఆర్‌డీవో ఝాన్సీరాణి హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. నిర్వాసితుల సంఘం నాయకులు గుడెల్లి వెంకటరావు, ప్రజానాట్య మండలి పల్లంట్ల మంగరాజు, ఎం.జీవరత్నం, జి.సూర్యకిరణ్‌, సిరిబత్తుల సీతారామయ్య, బొడ్డు రాంబాబు, నరసారెడ్డి, అరగంటి పెంటమ్మ, గుల్ల పోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-17T06:22:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising