ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరవై రోజులకే ఇలా..

ABN, First Publish Date - 2022-07-06T06:27:30+05:30

నాలుగు కోట్లతో మొగ ల్తూరు మండలం రామన్న పాలెం నుంచి మొగల్తూరు కెనాల్‌ రోడ్డు, కుక్కలవారి తోట, నల్లం వారితోట వరకూ ఆర్‌అండ్‌బీ రహదారిని సుమారు రూ.4 కోట్లతో ఇరవై రోజుల కిత్రం నిర్మించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాలుగు కోట్లతో మొగ ల్తూరు మండలం రామన్న పాలెం నుంచి  మొగల్తూరు కెనాల్‌ రోడ్డు, కుక్కలవారి తోట, నల్లం వారితోట వరకూ ఆర్‌అండ్‌బీ రహదారిని సుమారు రూ.4 కోట్లతో ఇరవై రోజుల కిత్రం నిర్మించారు.  నల్లంవారితోటలో ప్రాథమిక పాఠశాల సమీపంలో ఈ రహదారిని ఆనుకుని ఉన్న చెరువు గట్టు అప్రోచ్‌ను పట్టించుకోకుండా అధికారులు రోడ్డు వేసేశారు. దీంతో నిర్మించిన 20 రోజులకే.. కురిసిన వర్షాలకు నీట మునిగి కుంగిపోయింది. వర్షం నీరు నిలిచిపోయి కొత్త రోడ్డు కాస్తా కా లువలా మారింది. ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ రహదారి మూణ్నాళ్ల ముచ్చటగా మారిందని స్థానికులు వాపోయారు.      – మొగల్తూరు


మొన్న...

ఆకివీడు నుంచి అయి భీమవరం ఆర్‌అండ్‌బీ రహదారి పెద్ద పెద్ద గోతులతో నిండిపోయింది. వర్షం వచ్చిందంటే ఈ రోడ్డు ఓ చిన్న సైజు మడుగులను తలపిస్తుంది. ఇక్కడ వాహనం గోతుల్లో పడితే మరిక లేవదు. ప్రధాని మోదీ భీమవరం వచ్చిన సోమవారం రోజు ధాన్యం లోడు లారీ గోతిలో పడి కొన్ని బస్తాలు నేలపాలయ్యాయి. దీంతో ప్రధాని సభకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం మరో ట్రాక్టర్‌ గోతిలో దిగబడింది. ఈ రోడ్డుపై రోజూ అధికారులు, ప్రజా ప్రతినిధులు పర్యటిస్తున్నా.. ఈ గోతులు వచ్చిన చోట నెమ్మదిగా వెళ్లడం తప్ప వారు ఏం చేయడం లేదు. కాబట్టి మీరూ అలాగే స్లోగా.. జాగ్రత్తగా వెళ్లండి..! లేదంటే ఈ రోడ్డుపై రావడం మానుకోండి..!              – ఆకివీడు



Updated Date - 2022-07-06T06:27:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising