ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నాటక రంగానికి ఊపిరిపోస్తున్న కళాపరిషత్‌లు’

ABN, First Publish Date - 2022-05-21T06:17:09+05:30

సినీ, టీవీ రంగాల వల్ల కనుమరుగైపోతున్న నాటక రంగానికి కళాపరిషత్‌లు ఊపిరి పోస్తున్నాయని బీవీఆర్‌ కళాక్షేత్రం నిర్వాహకులు బుద్దాల వెంకట రామారావు, రిజిస్ట్రార్‌ లంకా వెంకటేశ్వర్లు అన్నారు.

పెదపాటి రామకృష్ణకు సత్కారం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు కల్చరల్‌, మే 20 : సినీ, టీవీ రంగాల వల్ల కనుమరుగైపోతున్న నాటక రంగానికి కళాపరిషత్‌లు ఊపిరి పోస్తున్నాయని బీవీఆర్‌ కళాక్షేత్రం నిర్వాహకులు బుద్దాల వెంకట రామారావు, రిజిస్ట్రార్‌ లంకా వెంకటేశ్వర్లు అన్నారు. ఏలూరు వైఎంహెచ్‌ఏ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి పెదపాటి రామకృష్ణ 75వ పుట్టిన రోజు సందర్భంగా ఏలూరు నాటక కళాసమితి ప్రారంభ వేడుక కార్యక్రమం నిర్వహించారు. తొలుత శ్రీనివాస భజన బృందం భక్తి గీతాలాపన, గంటికోట రాజేష్‌ శిష్య బృందం ప్రద ర్శించిన స్వాగత నృత్యం ఆకట్టుకుంది. అనంతరం జంధ్యాల రచించిన రామకృష్ణ ఆర్ట్స్‌ ఏలూరు ఆధ్వర్యంలో ‘గుండెలు మార్చబడును’ హాస్యనాటిక ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. బండారు రమేష్‌నాయుడు దర్శకత్వం వహించారు. అనంతరం పెదపాటి రామకృష్ణను ఘనంగా సత్కరిం చారు. వైఎంహెచ్‌ఏ అధ్యక్షుడు యర్రా సోమలింగేశ్వరరావు, ఎల్‌ వెంకటేశ్వరరావు, గరికపాటి కాళిదాసు, డి.రాములు, దువ్వి రామారావు, చప్పిటి సత్యనారాయణ, గరికపాటి కాళిదాసు, ఎండి ఖాజావళి, మజ్జి కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T06:17:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising