ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి ఏలూరులో పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు

ABN, First Publish Date - 2022-11-24T23:53:22+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుస రిస్తోన్న విద్యార్థి వ్యతిరేక విధానాలు, కాషాయీకరణ, మతోన్మాదం, ఫాసిజం ప్రధాన అంశాలుగా పీడీఎస్‌యూ 21వ రాష్ట్ర మహాసభల నిర్వహణకు వేదికగా ఏలూరు నగరం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు నిర్వహించే రాష్ట్రసభలను విజయవంతం చేసేందుకు సంఘ నాయకులు పెద్దసంఖ్యలో విద్యార్థులను సమీకరిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 24 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుస రిస్తోన్న విద్యార్థి వ్యతిరేక విధానాలు, కాషాయీకరణ, మతోన్మాదం, ఫాసిజం ప్రధాన అంశాలుగా పీడీఎస్‌యూ 21వ రాష్ట్ర మహాసభల నిర్వహణకు వేదికగా ఏలూరు నగరం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు నిర్వహించే రాష్ట్రసభలను విజయవంతం చేసేందుకు సంఘ నాయకులు పెద్దసంఖ్యలో విద్యార్థులను సమీకరిస్తున్నారు. విద్యార్థి వ్యతిరేక విధానాలకు ఉద్యమించాల్సిన అవసరాన్ని రాష్ట్రసభల్లో విద్యార్థులను చైతన్యపరిచి భవిష్యత్‌ పోరాట కార్యక్రమాలకు ఇక్కడే రూపకల్పన చేయను న్నారు. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్యను అందించడంలో ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తిచూపేందుకు సంఘ ప్రతినిధుల సభల్లో వివిధ రంగాల్లో మేధావులతో చర్చాగోష్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ముఖ్యంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఫీజు రీఇంబర్స్‌ మెంట్‌, ఉపకార వేతనాలు, అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన నగదు మొత్తాలను పెంచాలని డిమాండ్‌ చేస్తూనే ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు కార్యాచరణ ప్రకటించడానికి నాయకులు వ్యూహ రచన చేశారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా వున్న అధ్యాపక, ఆచార్య నియామకాలను వెంటనే చేపట్టాలని, సంక్షేమ వసతి గృహాల్లో మెనూ చార్జీలను పెంచాలని పాలకులను నిలదీయడానికి క్షేత్ర స్థాయిలో విద్యార్థులను ఐక్యం చేసేందుకు సంఘ రాష్ట్రసభలను కీలకమైన వేదికగా వినియోగించుకోనున్నట్టు నాయకులు వివరించారు. ఇంటర్‌, డిగ్రీ కళా శాలల్లో అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా బోధన జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర నలు మూలల నుంచి విద్యార్థి ప్రతినిధులు హాజరవుతారని, గత కార్యక్రమాలను సమీక్షించి, భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ మహా సభలను వేదికగా చేసుకుంటామని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.రామ్మోహన్‌ వివరించారు.

Updated Date - 2022-11-24T23:53:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising