ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం బకాయిలు రూ.247 కోట్లు

ABN, First Publish Date - 2022-12-31T01:32:23+05:30

జిల్లాలో సార్వా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నా సక్రమంగా సొమ్ములు అందక పోవడంతో బకాయిలు పేరుకు పోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రబీకి పెట్టుబడులు ఎలా ?

కొనుగోలు చేసిన ధాన్యం 2.70 లక్షల మెట్రిక్‌ టన్నులు

21 రోజులు దాటినా సొమ్ములు అందడం లేదంటున్న రైతులు

ఏలూరుసిటీ, డిసెంబరు 30 : జిల్లాలో సార్వా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నా సక్రమంగా సొమ్ములు అందక పోవడంతో బకాయిలు పేరుకు పోతున్నాయి. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు జిల్లాలో ధాన్యం సేకరణలో రైతులకు దాదాపుగా రూ. 247 కోట్లు వరకు చెల్లింపులు చేయాల్సి ఉందని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. రైతులు ధాన్యం అమ్ముకున్నా సొమ్ములు సకాలంలో రాని పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ధాన్యం అమ్మిన 21 రోజులకు సొమ్ములు బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సి ఉన్నా ఆ విధంగా జరగడం లేదని, కొంతమందికి నెలరోజులైనా సొమ్ములు అందడం లేదని కౌలు రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. ధాన్యం కొనుగోలులో ప్రవేశపెట్టిన నూతన విధానంలో అనేక సమస్యలు వస్తున్నాయని, ముఖ్యంగా తేమశాతం విషయంలో ఆర్‌బీకేలకు, మిల్లర్లకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోందని, తూకం విషయంలో ఇదే రకమైన వ్యత్యాసం ఉండడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రబీ సాగు ప్రారంభం కావడంతో పెట్టుబడులకు సొమ్ములు లేక ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

2.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

ఈ ఏడాది జిల్లాలో 3.80 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.553 కోట్లు విలువైన 2.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 38వేల 477 మంది రైతుల నుంచి సేకరించారు. ఇప్పటివరకు లక్షా 50 వేల మెట్రిక్‌ టన్నులకు సంబంధించి 30 వేల మంది రైతులకు రూ. 305 కోట్లు రూపాయిలు ధాన్యం సొమ్ములుగా వారి వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. జిల్లాలో 284 ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. జిల్లాలో ఇంకా 30 శాతంకు పైగా ధాన్యం కల్లాలపైనే ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ఇంకా లక్షా 10వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉంది. ధాన్యం అమ్మి 21 రోజులు దాటిన రైతులందరికీ బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమ చేశామని సంబంధిత శాఖాధికారులు చెబుతున్నారు. ఇంకా గడువు తీరినా తమకు సొమ్ములు అందలేదని పలువురు రైతులు చెబుతున్నారు.

ధాన్యం కొనుగోళ్లలో సమస్యలే..

ధాన్యం కొనుగోళ్లలో అనేక సమస్యలు ఎదరవుతున్నాయి. 21 రోజులు గడువు దాటినా జిల్లాలో చాలా మంది రైతులకు ధాన్యం సొమ్ములు అందని పరిస్థితి ఉంది. రబీ నాట్లు ప్రారంభమైన ఇంకా సార్వా సాగుకు సంబంధించి 30 శాతం ఽధాన్యం కల్లాల్లోనే ఉంది. ఆర్బీకేలు సూచించిన వే బ్రిడ్జిల వద్ద తూకం వేసినా మిల్లర్ల వద్దకు వెళ్లి తూకం వేస్తే తరుగు వస్తోంది. దీనివల్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది. అధికారులు ప్రత్యేక శ్రద్ధతో ధాన్యం సొమ్ములు సకాలంలో చెల్లించాలి.

– కె.శ్రీనివాస్‌, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి

Updated Date - 2022-12-31T01:32:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising