ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా స్కూల్‌ తెరవాలి

ABN, First Publish Date - 2022-08-05T05:17:22+05:30

ఎయిడెడ్‌ పాఠశాల స్థానంలో మండల పరిషత్‌ ప్రాథ మిక పాఠశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ముదినేపల్లి జాతీయ రహదారిపై ఆ గ్రామ దళితవాడ వాసులు రాస్తారోకో నిర్వహించారు.

ముదినేపల్లిలో జాతీయ రహదారిపై బైఠాయించిన గురజ దళితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాతీయ రహదారిపై నిరసనతో స్తంభించిన ట్రాఫిక్‌

ఎంపీపీ, అధికారుల హామీతో ఆందోళన విరమణ

గురజలో తాళాలు బద్దలు కొట్టి స్కూల్‌ తెరిచిన తల్లిదండ్రులు

ముదినేపల్లి, ఆగస్టు 4 : ముదినేపల్లి మండలం గురజలో రద్దయిన సాల్వేషన్‌ ఆర్మీ యాజమాన్యంలోని ఎయిడెడ్‌ పాఠశాల స్థానంలో మండల పరిషత్‌ ప్రాథ మిక పాఠశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ముదినేపల్లి జాతీయ రహదారిపై ఆ గ్రామ దళితవాడ వాసులు రాస్తారోకో నిర్వహించారు. ఎయిడెడ్‌ పాఠశాల రద్దు కావటంతో తమ పిల్లలకు చదువు దూరం అవుతుందని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఎవరూ స్పందించటం లేదని వాపో యారు. ఏలూరు కలెక్టరేట్‌ వద్ద రెండుసార్లు ధర్నా చేసినా అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదన్నారు. దళిత మహిళలు, యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిల్లలతో కలిసి రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. గంట సేపు వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ఆ సమయంలో అటు వెళుతున్న మాజీ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ దళితుల వద్దకు వచ్చి విషయం తెలుసుకున్నారు. టీడీపీ నాయకుడు కొడాలి వినోద్‌ దళితులకు మద్దతు తెలుపుతూ మండల పరిషత్‌ కార్యాలయం వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. రద్దయిన స్కూల్‌ స్థానంలో మండల పరిషత్‌ పాఠశాల ఏర్పాటు చేసి విద్యను అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎం రామిశెట్టి సత్యనారాయణ, అధికారులు మాట్లాడుతూ రెండు రోజుల్లో దళితవాడలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాఠశాల తలుపుల తాళాలను పగులకొట్టి విద్యార్థుల తల్లిదండ్రులు తెరిచారు. అనంతరం ఆందోళన విరమించారు. 


Updated Date - 2022-08-05T05:17:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising