ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గట్టు..రట్టు

ABN, First Publish Date - 2022-09-25T07:02:50+05:30

ఏలూరు జిల్లా నూజివీడు అటవీ రేంజ్‌లో కాట్రేనిపాడు అటవీ బ్లాక్‌లో సాగుతున్న అక్రమ క్వారీయింగ్‌ డొంక కదిలింది.

కొండగట్టు వద్ద వివరాలు సేకరిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాట్రేనిపాడు క్వారీ అక్రమాలపై విచారణ


నూజివీడు, సెప్టెంబరు 24: ఏలూరు జిల్లా నూజివీడు అటవీ రేంజ్‌లో కాట్రేనిపాడు అటవీ బ్లాక్‌లో  సాగుతున్న అక్రమ క్వారీయింగ్‌ డొంక కదిలింది. క్వారీ అక్రమాలపై ఆంధ్రజ్యోతిలో కథనం రావడంతో శని వారం విజయవాడకు చెందిన అటవీశాఖ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, మైనింగ్‌ సర్వేయర్లు, డీఆర్వోలు సందర్శించి  అక్రమ క్వారీయింగ్‌పై లెక్కలు తీశారు. ఉన్నతాధికా రులకు నివేదిక ఇవ్వనున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సీహెచ్‌ సుజాత, జిల్లా మైనింగ్‌ సర్వేయర్‌ నిర్మల, ఇన్‌చార్జ్‌ డీఆర్వో కె.ఎస్‌.వి హరిగోపాల్‌, మైలవరం ఫారెస్ట్‌ రేంజర్‌ ఎం.కల్యాణి తెలిపారు.


మాయ తేలేనా ?


ఈ అటవీశాఖకు చెందిన పెద్ద గుట్ట చుట్టూ వున్న పొలాలకు రెవెన్యూపట్టాలు ఉన్నాయని రైతులు చెబు తున్నారు.అటవీ–రెవెన్యూ శాఖల మధ్య నూజివీడు రేంజ్‌ లోని కాట్రేనిపాడు, బలివే, మడిచర్ల, సుంకొల్లు బ్లాక్‌లలో ఈ రెండుశాఖల మధ్య వేలాది ఎకరాల భూమిపై పంటలు ఉన్నాయి. ఈ అటవీ ప్రాంతం కేంద్రప్రభుత్వ పరిధిలోని రిజర్వ్‌ ఫారెస్ట్‌. ఈ రెండుశాఖల మధ్య భూ వివాదాలు గత 30 ఏళ్ల నుంచి సాగుతున్నాయి. ఎక్కు వగా ఈ రిజర్వ్‌ ఫారెస్ట్‌ అంతా కనుమరుగై వ్యవసాయ భూములుగా మారిపోతున్నా అటవీశాఖ పట్టించు కోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర అటవీశాఖ ఉన్నతాధికారులు పాత కృష్ణా జిల్లా పరిధి లోని నూజివీడు, మైలవరం, తిరువూరు పరిధిలోని అటవీ భూముల విషయంపై దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపితే వేలాది ఎకరాల అటవీభూమి  రక్షించ బడుతుందని పలువురు భావిస్తున్నారు.


Updated Date - 2022-09-25T07:02:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising