ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాత్రి పూట కదలొద్దు

ABN, First Publish Date - 2022-01-19T06:06:26+05:30

కొవిడ్‌ నివారణ లో భాగంగా ప్రభుత్వం కట్టడికి దిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్ఫ్యూ ఆదేశాలు అమలులోకి..
శుభకార్యాలకు 200 మందికే అనుమతి
మాస్క్‌ లేకుంటే రూ.100 పెనాల్టీ




ఏలూరు, జనవరి 18(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ నివారణ లో భాగంగా ప్రభుత్వం కట్టడికి దిగింది. మంగళవారం రాత్రి నుంచి అమలులోకి వచ్చిన కర్ఫ్యూ  ఈ నెల 30వ తేదీ వరకు అమలులో ఉంటుంది. రాత్రి 11 నుంచి తెల్లవారుజాము ఐదు గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల కరోనా సమ యంలో రాత్రి కర్ఫ్యూ అమలైంది. అప్పటి మాదిరిగానే ప్రస్తుతం ప్రత్యేక కట్టడికి దిగారు. అత్యవసర సర్వీసు లను మినహాయించి.. కర్ఫ్యూ అమలు బాధ్యతను పోలీ సులకు అప్పగించారు. మాస్క్‌ ధరించకుండా బహిరం గ ప్రదేశాల్లో తిరిగే వారికి రూ.100 పెనాల్టీ విధించను న్నారు. రాత్రి పూట కర్ఫ్యూలో కొన్నింటికి మాత్రమే అనుమతులు ఇచ్చారు. ఆసుపత్రులు, మెడికల్‌ ల్యాబ్స్‌, ఫార్మసీ, ప్రింట్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్‌ మీడియా, టెలీ కమ్యూనికేషన్స్‌, ఇంటర్నెట్‌ సర్వీసులు, ఐటీ, సంబంధిత సర్వీసులు, పెట్రోలు బంకులకు కర్ఫ్యూ నుంచి మినహా యింపు ఇచ్చారు. విద్యుత్‌, నీటి సరఫరా, పారిశుధ్య సిబ్బంది అత్యవసర విధుల్లో పాల్గొనేందుకు వీలుగా మినహాయింపు వర్తింపజేశారు. అంతరాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు అనుమతులు ఇస్తూనే ఎయిర్‌ పోర్టు, రైల్వే, బస్టాండు నుంచి రాకపోకలు సాగించే వారు తమ ప్రయాణ టికెట్‌లను చూపించాలి. గర్భిణు లు, పేషెంట్లకు పూర్తి మినహాయింపు ఉంది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు, మతపరమైన వాటిలో పాల్గొనేందుకు 200 మందికి మించకుండా అనుమతి ఇచ్చారు. అంతర్గత కార్యకలాపాలకు వంద మంది హాజ రయ్యేందుకు మాత్రమే అనుమతులు ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.


Updated Date - 2022-01-19T06:06:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising