ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటు.. వజ్రాయుధం

ABN, First Publish Date - 2022-01-26T05:34:21+05:30

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రజలకు వజ్రాయుధం వంటిదని అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నారు.

కొవ్వూరులో ఓటరును సత్కరిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ

సీనియర్‌ ఓటర్లకు సత్కారం


ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రజలకు వజ్రాయుధం వంటిదని అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 18 ఏళ్ల వయసు నిండిన వారంతా ఓటు నమోదు చేయించుకోవాలని సూచించారు. ఓటుతో ప్రజా ప్రతినిధలను ఎన్నుకోవడం ద్వారా మన అభివృద్ధికి మనమే బాటలు వేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందన్నారు. ప్రజాస్వామ్యం పటిష్టం కావడానికి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.


కొవ్వూరు, జనవరి 25: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని కొవ్వూరు తొమ్మిదో అదనపు జిల్లా జడ్జి ఆర్‌.శరత్‌బాబు అన్నా రు. ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. సీనియర్‌ ఓటర్లను సత్కరించి, కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు. డీఎల్‌పీవో బి.శివమూర్తి, తహసీల్దార్‌ బి.నాగరాజు నాయక్‌, డీటీ కేయూ.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. సీతంపేటలో సర్పంచ్‌ జెట్టి బంగారయ్య, పాఠశాల హెచ్‌ఎం మల్లాది కళ్యాణ్‌కుమార్‌, కాపవరంలో ఎంపీటీసీ వై.సురేష్‌, మజహరుల్లా బేగ్‌, సుంకర సత్యనారాయణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


ద్వారకాతిరుమల: ఓటు హక్కుతో పాలకులను ఎన్నుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని తహసీల్దారు సత్యనారాయణ అన్నారు. బాల యోగి గురుకుల పాఠశాలలో బాలికలతో ప్రతిజ ్ఞచేయించారు.

Updated Date - 2022-01-26T05:34:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising