ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్సిపల్‌ కార్మికుల నిరసన దీక్షలు

ABN, First Publish Date - 2022-05-18T05:32:11+05:30

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన దీక్షను ప్రారంభించారు.

భీమవరంలో నిరసన దీక్ష చేపట్టిన కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం అర్బన్‌, మే 17: మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన దీక్షను ప్రారంభించారు. యూనియన్‌ జిల్లా కార్యదర్శి బి.వాసుదేవరావు మాట్లాడుతూ కార్మికులకు హెల్త్‌ అలవెన్సు విడుదల చేయా లని డిమాండ్‌ చేశారు. అప్కాస్‌ టెక్నికల్‌ సమస్య కారణంగా ఎక్కు వ మంది కార్మికులు బలవుతున్నారన్నారు. దీక్షలో ఎం.రాజు, ఎం.శివ, నిమ్మకాయల ధనలక్ష్మి, కామాక్షి, బంగారు వరలక్ష్మి, ధరాల చిన్నా, నాలాపు నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యలయం వద్ద ధర్నా నిర్వహించా రు. చెల్లబోయిన రంగారావు, కిల్లరి మల్లేశ్వరరావులు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జూన్‌ 2 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ జ్యోతిలక్ష్మికి వినతిపత్రం అందించారు.


తణుకు: మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకుంటే జూన్‌ 2న రాష్ట్ర వ్యాప్త సమ్మె తప్పదని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు, మునిసిపల్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూ నియన్‌ తణుకు శాఖ అధ్యక్షుడు బొద్దాని నాగరాజు హెచ్చరించారు. మంగళవారం కమిషనర్‌ సృజనకు వినతి పత్రం అందించారు.

Updated Date - 2022-05-18T05:32:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising