ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్టిక్‌ వినియోగం నిషేధించాలి

ABN, First Publish Date - 2022-08-19T05:10:32+05:30

ప్లాస్టిక్‌ నిషేధంతో పాటు పర్యావరణ పరిరక్ష ణకు మొక్కలు పెంచాలని మానవత సేవా సంస్థ జిల్లా చైర్మన్‌ గమిని రాంబాబు అన్నారు.

ఆచంటలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్న మానవత ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తణుకు/అత్తిలి, ఆగస్టు 18: ప్లాస్టిక్‌ నిషేధంతో పాటు పర్యావరణ పరిరక్ష ణకు మొక్కలు పెంచాలని మానవత సేవా సంస్థ జిల్లా చైర్మన్‌ గమిని రాంబాబు అన్నారు. గురువారం మానవత శాంతి ర్యాలీ వారోత్సవాల్లో భాగంగా రాష్ట్రపతి రోడ్డులోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజి నుంచి విద్యార్థులతో కలసి ఎన్టీఆర్‌ పార్కు వరకు కొనసాగింది. కార్యక్రమంలో పలు కళాశాలల విద్యా ర్థులు, ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి, వంగూరి హనుమంతరావు, భూ పాల్‌, కరుణాకర్‌ చౌదరి, ఎస్వీ సతీష్‌, ఆలపాటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అత్తిలిలో పర్యావరణ పరిరక్షణ కోరుతూ శాంతి ర్యాలీ నిర్వ హించారు. బాలికల ఉన్నత పాఠశాల నుంచి సంత మార్కెట్‌ మీదుగా బస్టాండ్‌కు చేరుకుని మానవహారం నిర్వహించారు. మానవత అధ్యక్షుడు తోట సుబ్బారావు, అనాల ఆదినారాయణ, బోడపాటి  సూర్య చంద్రరావు, కొరిపల్లి  విజయకుమార్‌, ముదునూరి బాలకృష్ణంరాజు పాల్గొన్నారు.


ఆచంట: మానవత వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శాంతి ర్యాలీ నిర్వహించారు. ఆచంట యూనిట్‌ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ శాంతిని కోరుతూ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. మానవత డైరెక్టర్‌ కేతా రామకృష్ణ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అధ్యక్షుడు కొమ్మన పెద్దిశర్మ, నెక్కంటి శివన్నారాయణ, కంచర్ల శివ, కె.సత్యనారాయణ, బొక్కా రామకృష్ణ, నంబూరి అంజిబాబు, షేక్‌ ముజుబుల్‌ రహ్మాన్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T05:10:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising