ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉన్నారంతే..

ABN, First Publish Date - 2022-08-06T05:30:00+05:30

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజలు ఎన్నుకున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులంతా ఎప్పుడూ లేని విధంగా తమ పరపతిని కోల్పోయారన్న ఆందోళన వ్యక్తమ వుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజా ప్రతినిధులు.. సిబ్బంది మధ్య సమన్వయ లేమి.. సర్పంచ్‌లకు ప్రమేయం లేని పథకాలు

వలంటీర్‌ వ్యవస్థతో పాలకవర్గాల పాత్ర నామమాత్రం

గ్రామాల్లో సర్పంచ్‌ల మాట వినని సిబ్బంది

కలెక్టర్‌కు ఫిర్యాదుల వెల్లువ

ప్రాభవం కోల్పోయిన పంచాయతీలు

వైసీపీ అధికారంలోకి వచ్చాక పంచాయతీలు ప్రాభవాన్ని కోల్పోయాయి. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సమన్వయం లోపించింది. సచివాల యాలు, వలంటీర్ల వ్యవస్థతో ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌కు ప్రమేయం లేకుం డానే కార్యక్రమాలన్నీ జరిగిపోతున్నాయి. సిబ్బంది తమ ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తుండడంతో కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళుతున్నాయి. కేవలం టీడీపీ ప్రాతినిధ్యం వహించే సర్పంచ్‌లు, ఎంపీపీలకే ఇలా అవమానాలు జరగడం లేదు. అధికార పార్టీ ఎంపీపీలు తమ మనుగడ కోసం పాకులాడే పరిస్థితి నెలకొంది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి):

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజలు ఎన్నుకున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులంతా ఎప్పుడూ లేని విధంగా తమ పరపతిని కోల్పోయారన్న ఆందోళన వ్యక్తమ వుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలనే తేడా లేకుండా అందరిదీ ఇదే పరిస్థితి. దీనికి ప్రభుత్వం అనుసరిస్తున్న ఒక ఎత్తయితే నియోజకవర్గస్థాయి ప్రజా ప్రతినిధులు మరో కారణం. కేవలం చెప్పుకోవడానికే వారంతా సర్పంచ్‌లు,  ఎంపీపీలు. సచివాలయ వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత పంచాయతీలు ఉనికి కోల్పోయే దుస్థితి నెలకొంది. గ్రామాల్లో పారిశుధ్య పనులు, మంచినీటి సరఫరాకే పరిమితం అవుతున్నాయి. పాలక వర్గాల తీర్మానాలు చేసేందుకు ఏమీ ఉండడం లేదు. నీటి సరఫరా, పారిశుధ్య పనులకు మాత్రమే జనరల్‌ ఫండ్స్‌ సరిపోతు న్నా యి. అంతకుమించి నిధులున్న పంచాయతీల్లో వివాదా లు తలెత్తుతున్నాయి. సర్పంచ్‌ల మాటను సిబ్బంది పెడచెవిన పెడుతున్నారు. మరోవైపు ప్రభుత్వమే నిధులు లాగేసుకుం టోంది. మొత్తంగా సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారి పోయారు. 

గతంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తే సర్పంచ్‌లకు గౌరవం ఉండేది. పెన్షన్‌ల నుంచి రేషన్‌ కార్డులు, ఇళ్లు, పట్టాలు ఇలా ఏ పథకమైనా ముందుగా పంచాయతీ సర్పంచ్‌ల నుంచే లబ్ధిదారులకు సమాచారం వెళ్లేది. పంచాయ తీలకు దరఖాస్తులు చేసుకునేవారు. ఇప్పుడు వలంటీర్ల ద్వారానే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చినా, కార్డులు మంజూరుచేసినా సచివాలయాలకు ముందుగా సమాచారం వచ్చేస్తోంది. అక్కడ నుంచి వలంటీర్లు లబ్ధిదారులకు సమాచారాన్ని చేరవేస్తు న్నారు. పంచాయతీలకు మాత్రం లబ్ధిదారులతో కూడిన ఒక పత్రాన్ని పంపుతున్నారు. దీంతో పం చాయతీలకంటే ప్రభుత్వానికే ప్రాధాన్యం ఏర్పడుతోంది. మరోవైపు సమావేశాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు చెప్పుకునే పరిస్థితి పంచాయ తీలకు లేదు. ఏ సంక్షేమ పథకమైనా నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల ద్వారా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. లబ్ధిదారులను ఒకచోటకు చేర్చి ప్రభుత్వ పథకాలను చెప్పుకునేలా చర్యలు తీసు కుంటున్నారు. ఇది కూడా పంచాయతీ పాలక వర్గాలకు విలువ లేకుండా చేస్తోంది. అధికార పార్టీ ప్రాతినిధ్యం వహించే సర్పంచ్‌ల్లోనూ ఇదే విధమైన అభిప్రాయం నాటుకుపోయింది. 

కొన్ని నెలలుగా నిధులు సున్నా

గ్రామాలను కాస్తయినా అభివృద్ధి చేద్దామంటే నిధులు లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. విద్యుత్‌ బకాయిలు చెల్లింపుకోసమని 14వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీ ఖాతాల నుంచి ప్రభుత్వం ఎత్తుకుపోయింది. అదే మాదిరి 15వ ఆర్థిక సంఘం నిధులు మళ్లించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సీఎఫ్‌ఎంఎస్‌ బదులుగా పీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాలు తెరచుకోమని సూచిచింది. ఇక ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించే అవకాశం లేకుండా కొత్త ఖాతాల్లో ఆర్థిక సంఘం నిధులు జమ చేయనున్నట్టు ప్రకటించారు. ఖాతాలు తెరచి నెలలు గడచిపోతున్నాయి. ఇప్పటి వరకు ఆర్థిక సంఘం నిధులు ఒక్కపైసా పంచాయతీలకు జమ కాలేదు. అభివృద్ధి పనులు చేసేందుకు ఆర్థిక సంఘం నిధులపైనే ఆధార పడుతున్నారు. అవే ఇప్పుడు కరువైపోయాయి. మరోవైపు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోనూ నిధులు రావడం లేదు. ప్రభుత్వం నిర్మించే జగనన్న ఇళ్లకు ఉపాధి హామీ నిధులను కేటాయిస్తున్నారు. దీంతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అవకాశం లేకపోతోంది. మొత్తంపైన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఆశించిన పరపతి లభించడం లేదు. ప్రభుత్వ సిబ్బందితోనే పథకాలు అమలు చేస్తున్నారు. అభివృద్ధి పనులకు నిధులు లేకపోయాయి. పంచాయతీల్లో ఆస్తి పన్ను రూపంలో వచ్చే సాధారణ నిధులను పారిశుధ్యం, మంచినీటి నిర్వహణకు వెచ్చించడానికి సర్పంచ్‌లు పరిమితమవుతున్నారు.  


Updated Date - 2022-08-06T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising