ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలి

ABN, First Publish Date - 2022-05-28T05:40:53+05:30

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలని నిత్యావసర సరుకులు ధరలు అదుపు చేయాలని సీపీఎం మండల కన్వీనర్‌ ఇంజేటి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

ఆకివీడు పట్టణంలో పెట్రోల్‌ బంక్‌ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం రూరల్‌, మే 27: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలని నిత్యావసర సరుకులు ధరలు అదుపు చేయాలని సీపీఎం మండల కన్వీనర్‌ ఇంజేటి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని తోకతిప్ప గ్రామంలో పెట్రోల్‌ బంక్‌ వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈనెల 30న జరిగే ధర్నా జయప్రదం చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌పై పన్నులు పెంచుతూ ప్రజలపై మరింత భారాలు వేస్తున్నాయన్నారు. తిరుమాని నాగేశ్వరరావు, తిరుమాని సూర్యనారాయణ, తిరుమాని శ్రీను, తదితరులు పాల్గొన్నారు. 


ఆకివీడు: పెరుగుతున్న ధరలను అదుపుచేయడంలో కేంద్ర ప్రభు త్వం విఫలమైందని సీపీఎం పట్టణ అధ్యక్షుడు కె.తవిటినాయుడు అన్నారు. పెట్రోల్‌ బంక్‌ ధర్నా చేసి మాట్లాడారు. డోకల రవితేజ, బివీ వర్మ, కె.రామకృష్ణ, కె.సిరీనాయుడు, పాండురంగారావు, వాసు, భీష్మ తదితరులు ఉన్నారు.


30న ధర్నా విజయవంతం చేయాలి

తణుకు / తాడేపల్లిగూడెం రూరల్‌ / పెంటపాడు: అధిక ధరలు, పన్ను ల భారం తగ్గించాలని ఈ నెల 30న వామపక్షాల ఆధ్వర్యంలో  కలెక్టరేట్‌ వద్ద  జరిగే ధర్నా విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు,  పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, సీపీఎం పట్టణ కార్యదర్శి ప్రతాప్‌ కోరారు. శుక్రవారం పోస్టర్లను ఆవిష్కరించారు. తాడేపల్లిగూడెంలో సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు మండల నాగేశ్వరరావు, పెంటపాడులో సీపీ ఎం నాయకులు చిర్లా పుల్లారెడ్డి, బంకూరు నాగేశ్వరరావు పోస్టర్లు ఆవిష్క రించారు. సీపీఐ నాయకులు అల్లం రాము, దాస్యం రాము, ముండేటి వసం తకుమారి, తాడికొండ గంగా భవాని తదితరుల పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T05:40:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising