ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోలు ధరల అదుపులో ప్రభుత్వం విఫలం

ABN, First Publish Date - 2022-05-27T05:43:51+05:30

ధరలు అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జేఎన్‌వీ గోపాలన్‌ విమర్శించారు.

భీమవరం పెట్రోల్‌ బంక్‌ వద్ద ధర్నా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం అర్బన్‌ / నరసాపురం టౌన్‌, మే 26: ధరలు అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జేఎన్‌వీ గోపాలన్‌ విమర్శించారు. పెట్రోలు, డీజిల్‌ గ్యాస్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం పెట్రోల్‌ బంకు వద్ద ధర్నా నిర్వహించారు. జెన్‌ఎవీ.గోపాలన్‌, చెల్లబోయిన రంగారావు, లంకా కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ డీజిల్‌ గ్యాస్‌ ధరలు పెంచి సామాన్య ప్రజలు నడ్డివిరిచిందని, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ చార్జీల పెంచడం గోరుచుట్టుపై రోకలి పోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలు బతకడం కష్టంగా ఉందన్నారు. ధర్నాలో వాసుదేవరావు, జక్కంశెట్టి సత్యనారాయణ, ఎం.వైకుంఠరావు, డీఎస్‌.రాజు, బి.వరలక్ష్మి, కె.సత్యనారాయణ, చైతన్య ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు. నరసాపురంలో సీపీఎం ఆధ్వర్యంలో అం దోళన చేపట్టారు. ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫల మైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెత్త, ఇంటి పన్నుల పేరుతో ప్రజల్ని దోచే స్తుందన్నారు. ఎం.త్రిమూర్తులు, నీలకంఠం పాల్గొన్నారు. ఆచంట పెట్రోల్‌ బంక్‌ వద్ద కేతా గోపాలన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీపీఐ ఏరియా సెక్రటరీ శలా పూర్ణ చం ద్రజోషి, ఉన్నమట్ల దుర్గా ప్రసాద్‌, సిర్రా నరసింహమూర్తి, కుసుమే జయరాజు, నెక్కంటి కృష్ణ పాల్గొన్నారు. పెనుగొండ ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌బంక్‌ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ధరలు తగ్గించే వరకు పోరాడతామన్నారు. సీపీఎం కార్యదర్శి గుర్రాల సత్యనారాయణ, ఎస్‌.వెంకటేశ్వరరావు, పులిదిండి రామారావు, నీలాపు ఆదినారాయణ పాల్గొన్నారు. తణుకు వై జంక్షన్‌ వద్ద వామపక్షాలు ధర్నా నిర్వహిం చాయి. సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల బీమారావు, సీపీఎం పట్టణ కార్యదర్శి పీవీ ప్రతాప్‌, బొద్దాని నాగరాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

––––––––––––––––––––––––––––––––



Updated Date - 2022-05-27T05:43:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising