ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్య కేసులో ఎమ్మెల్సీని బర్తరఫ్‌ చేయాలి

ABN, First Publish Date - 2022-05-24T05:43:11+05:30

కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తక్షణం బర్తరఫ్‌ చేయాలని కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు డిమాండ్‌ చేశారు.

భీమవరంలో కేవీపీఎస్‌ నాయకుల నిరసన ప్రదర్శన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం అర్బన్‌, మే 23: కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తక్షణం బర్తరఫ్‌ చేయాలని కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు డిమాండ్‌ చేశారు. సుబ్రహ్మఽణ్యం హత్యను నిరసిస్తూ కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. క్రాంతిబాబు మాట్లాడుతూ ఎమ్మెల్సీ అనంత్‌ ఉదయ్‌ భాస్కర్‌ కుల దురహంకారంతో దళిత యువకుడి ని దారుణంగా హత్య చేశారన్నారు. ప్రభుత్వంలో పెద్దల అండ లేకుండా ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడిని హత్య చెయ్యడానికి సాహసిం చడన్నారు. అనంతబాబుని కాపాడడానికి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రయత్నం చేస్తున్నారనడానికి ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. గతంలో దళిత యువకుడిని శిరోముండనం చేసిన త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం నేడు ఇంకో దళిత యువకుడిని హత్య చేసిన ఎమ్మెల్సీకి మంత్రి పదవి ఇస్తారేమోనని ఎద్దేవా చేశారు. ప్రజాప్రతినిధులే దళితులపై హత్యలు, దాడులు చేయడం దారుణమన్నారు. సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ నాయకులు ఎం.వైకుంఠరావు, శేషపు ఆశ్రీయ్య, రపాక రాజీవ్‌, డి.ఆశోక్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:43:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising