ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదమరిస్తే అంతే..

ABN, First Publish Date - 2022-05-20T06:29:48+05:30

కొల్లేటికోట ఆర్‌అండ్‌బీ రహదారిపై భారీ గోతులు ఏర్పడ్డాయి. ఆదమరిచి ప్రయాణిస్తే గోతుల్లో పడిపోవడం గానీ, రోడ్డు మార్జిన్‌ దిగువకు వెళ్లి పడిపోవడం ఖాయం.

కొల్లేటి కోట ఆర్‌అండ్‌బీ రోడ్డు గోతుల దృశ్యాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొల్లేటికోట ఆర్‌అండ్‌బీ రోడ్డు అధ్వానం 

పెద్దింట్లమ్మ భక్తులు, స్థానికులకు తప్పని ఇబ్బందులు 

కనీసం మరమ్మతులైనా చేపట్టాలని వినతి


కైకలూరు, మే 19 : కొల్లేటికోట ఆర్‌అండ్‌బీ రహదారిపై భారీ గోతులు ఏర్పడ్డాయి. ఆదమరిచి ప్రయాణిస్తే గోతుల్లో పడిపోవడం గానీ, రోడ్డు మార్జిన్‌ దిగువకు వెళ్లి పడిపోవడం ఖాయం. కైకలూరు మండలం ఆలపాడు నుంచి కొల్లేటికోటకు వెళ్లే రహదారిలో పెంచికలమర్రు నుంచి సర్కారు కాలువ వరకు ఆర్‌అండ్‌బీ రహదారి అధ్వానంగా ఉంది. కొల్లేరు ముంపు సమయంలో రహదారి ధ్వంసమైనా మరమ్మతులు నిర్వహించకపోవడంతో ద్విచక్రవాహనదారులు, ఆటో వాలాలు ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం ఈ రహదారిలో వేలాదిమంది  రాకపోకలు సాగిస్తుంటారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు  భక్తులు ఈ రహదారిలోనే ప్రయాణిస్తుంటారు. ఆయా గ్రామాల స్థానికులు, భక్తులు గోతుల్లో పడి గాయాలపాలవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కనీసం మరమ్మతులు చేపట్టాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.

మరమ్మతులు చేపట్టాలి 

 వరదల సమయంలో కొల్లేరు రహదారి దెబ్బతింది. అప్పటి నుంచి కనీసం మరమ్మతులు కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రాత్రి సమయంలో సైకిళ్లు, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు ప్రమాదాలకు గురువు తున్నారు. అధికారులు, పాలకులు స్పందించి కనీసం మరమ్మతులు చేపట్టాలి. 

- ముంగర కొండలు, వడ్లకూటితిప్ప



Updated Date - 2022-05-20T06:29:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising