ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొడాలి నానిపై టీడీపీ శ్రేణులు ఫిర్యాదులు

ABN, First Publish Date - 2022-09-12T02:34:52+05:30

మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆయన కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం: మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆయన కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా ఆదివారం టీడీపీ నాయకులు ధర్నాలు నిర్వహించి పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తణుకు పోలీస్‌స్టేషన్‌లో నానిపై ఫిర్యాదు చేశారు. ఉండి పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భీమవరం పట్టణం పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ రాష్ట్ర నాయకుడు మెంటే పార్ధసారథి ఆధ్వర్యంలో, ఆకివీడు, కాళ్ళ, పాలకోడేరు తదితర ప్రాంతాల్లో నానిపై ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.  

Updated Date - 2022-09-12T02:34:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising