ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృత్యువుతో పోరాడలేక.. చిన్నారి అన్విక మృతి

ABN, First Publish Date - 2022-07-04T06:30:14+05:30

చిన్నారి అన్విక ఇక లేదన్న వార్త కుటుంబసభ్యులతో పాటు పలువురిని కలచివేసింది.

చికిత్స పొందుతున్న అన్విక(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకాతిరుమల, జూలై 3 : చిన్నారి అన్విక ఇక లేదన్న వార్త కుటుంబసభ్యులతో పాటు పలువురిని  కలచివేసింది. విజయవాడ ఆసుపత్రి నుంచి ఆదివారం ఉదయం చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామమైన మండలంలోని జి కొత్తపల్లికి తీసుకు రాగా వందలాది మంది తరలివెళ్లారు. బొండాడ వెంకన్నబాబు, జంగా కృష్ణారెడ్డితో పాటు పలువురు చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. గత నెల 5న స్థానిక చర్చి వద్ద ఆడుకుంటుండగా అక్కడ భోజనాల కోసం సిద్ధం చేసిన మరుగుతున్న సాంబారు పాత్రలో పడింది. తీవ్రంగా గాయాలపాలై దాదాపు 28 రోజులపాటు మృత్యువుతో పోరాడిన చిన్నారి అన్విక (5) శనివారం రాత్రి మృతి చెందింది. చిన్నారి పరిస్థితిపై గత నెల 8న ఆంధ్రజ్యోతిలో ‘చిన్నారి ప్రాణం నిలుపరూ’ శీర్షికన కథనం వెలుబడింది. పలువురు దాతలు స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కృషితో ప్రభుత్వం సీఎం రిలీఫ్‌ఫండ్‌ నుంచి రూ.15 లక్షలు నిధులు మంజూరు చేసింది. ఇన్ని ప్రయత్నాలు జరిగినా పాప దక్కకపోవడంతో ఆ కుటుంబం కన్నీరుమన్నీరవుతోంది.

Updated Date - 2022-07-04T06:30:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising