ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్తీ సారా, మద్యం అరికట్టాలని మహిళల ఆందోళన

ABN, First Publish Date - 2022-03-19T22:33:17+05:30

పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో మహిళలు రోడ్డుపై బైఠాయించి కల్తీ సారా, మద్యం అరికట్టాలని ఆందోళన చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకాతిరుమల: పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో తెలుగుదేశం  ఆధ్వర్యంలో మహిళలు రోడ్డుపై బైఠాయించి కల్తీ సారా, మద్యం అరికట్టాలని ఆందోళన చేపట్టారు. పార్టీ పిలుపుమేరకు శ్రేణులు ఏపీ వ్యాప్తంగా  బ్రాందీ షాపుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తిమ్మాపురంలోని భీమడోలు-ద్వారకాతిరుమల రోడ్డుపై మహిళలు, టీడీపీ నాయకులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం బ్రాందీ బాటిళ్లను పగలగొట్టి  నిరసన వ్యక్తం చేశారు. జె బ్రాండ్ మద్యాన్ని, జె టాక్స్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. కల్తీ సారా తాగడం వల్ల  రాష్ట్రంలో చాలా మంది చనిపోతున్నారన్నారు. సీఎం జగన్ పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారం సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు లంకా  సత్యనారాయణ, మండల టీడీపీ నాయకులు పోలిన శీను, మాజీ జెడ్పీటీసీలు బీవీయస్  చౌదరి, ఏపూరి దాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-19T22:33:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising