ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేబిస్‌తో జూనియర్‌ అసిస్టెంట్‌మృతి

ABN, First Publish Date - 2022-06-27T06:21:45+05:30

రేబిస్‌తో జూనియర్‌ అసిస్టెంట్‌మృతి

కర్రి పద్మావతి (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుమంట్ర, జూన్‌ 26: కుక్కలు కరవడంతో రేబిస్‌ సోకి, చికిత్స పొందుతూ పంచాయతీ జూని యర్‌ అసిస్టెంట్‌ మృతి చెందింది. మండలంలోని మార్టేరు పంచాయతీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కర్రి పద్మావతి (35) మే 23న ఆలమూరు నుంచి మార్టేరు వస్తుండగా వెలగలేరు మలుపు వద్ద కుక్కలు ఆమెపై దాడి చేశాయి. దీంతో కాలికి బలమైన గాయమైంది. మార్టేరు పీహెచ్‌సీలో చికిత్స పొందిన అనంతరం మెరుగైన చికిత్స కోసం కాకినాడ తరలించారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో హైదరాబాద్‌లో వైద్యం చేయిస్తున్నారు. కుక్క కాటు కారణంగా రేబిస్‌ సోకిందని, మెదడుకు వ్యాధి సోకడంతో ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు చెప్పారని స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆమె మృతి చెందింది. స్వగ్రామం ఆలమూరుకు భౌతికకాయాన్ని తరలించారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భౌతికకాయాన్ని జడ్పీటీసీ సభ్యురాలు కర్రి గౌరీసుభాషిణి, సర్పంచ్‌ మట్టా కుమారి, ఉప సర్పంచ్‌ కర్రి వేణుబాబు, గ్రామ కార్యదర్శి నాగబాబు, పంచాయతీ ఉద్యోగులు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు సందర్శించారు. పద్మావతి మృతికి సంతాపం తెలిపారు.

Updated Date - 2022-06-27T06:21:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising