ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పథకాల అమలులో పారదర్శకత పాటించాలి : జేసీ

ABN, First Publish Date - 2022-05-18T05:44:33+05:30

ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత పాటించాలని జాయింట్‌ కలెక్టర్‌ జేవీ మురళి అన్నారు.

తాడేపల్లిగూడెం మండలంలో డ్రోన్‌ సర్వే పరిశీలిస్తున్న జేసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం రూరల్‌, మే 17: ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత పాటించాలని జాయింట్‌ కలెక్టర్‌ జేవీ మురళి అన్నారు. కొండ్రుప్రోలు, ఎల్‌.అగ్రహారం గ్రామాల్లో మంగళ వారం ఆయన పర్యటించారు. రేషన్‌ డిపోల్లో రిజిస్టర్లు, వేలిముద్ర యంత్రా లను పరిశీలించారు. పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత రక్ష పథకం డ్రోన్‌ సర్వేను ఆయన పరిశీలించారు. ఎంపీడీవో జీవీకే మల్లికా ర్జునరావు, డిప్యూటీ తహసీల్దార్‌ శివశంకర్‌, పౌరసరఫరాల డీటీ సీతారత్నం, టౌన్‌ సర్వేయర్‌ రౌతు రామకృష్ణ, కార్యదర్శి టి.రవిచంద్ర పాల్గొన్నారు. ఉండి మండలంలో పర్యటించి సర్వే పూర్తయిన గ్రామాలలో స్టోన్‌ ప్లాంటేషన్‌ త్వరి తగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. తహసీల్దారు కృష్ణజ్యోతి, సర్వేశాఖ సహాయ సంచాలకులు జాషువా ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. భీమవరం మండలంలో భూముల రీసర్వే పనులను వేగవంతం చేయాలన్నారు. కొవ్వాడ అన్నవరం గ్రామంలోని భూముల రీసర్వే పనులను జేసీ పరిశీలించారు. సర్వేశాఖ సహాయ సంచాలకుడు జాషువా, తహసీల్దార్‌ ఏవి రమణారావు, తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం ఉరదాలపాలెం, మంచిలి లో సచివాలయం, రేషన్‌ షాపులను జేసీ జేవీ.మురళి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్‌ మురళీమోహన్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T05:44:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising