పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వద్దు: జేసీ
ABN, First Publish Date - 2022-12-31T22:39:07+05:30
నగరంలో పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేదిలేదని ఇన్‌చార్జి కమిషనర్, జాయింట్ కలెక్టర్ అరుణ్‌బాబు అన్నారు.
ఏలూరు టూటౌన్, డిసెంబరు 31: నగరంలో పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేదిలేదని ఇన్‌చార్జి కమిషనర్, జాయింట్ కలెక్టర్ అరుణ్‌బాబు అన్నారు. శనివారం అధికారులతో కలిసి పారిశుధ్య పనులు పరిశీలించారు. ఈసందర్భంగా అరుణ్‌బాబు మట్లాడుతూ నగరాన్ని శుభ్రపరిచే బాధ్యత శానిటరీ ఇన్‌స్పెక్టర్లదేనన్నారు. పారిశుధ్య సిబ్బందిని వారికి కేటాయించిన పాయింట్ల వద్ద సర్దుబాబు చేసి పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుని వ్యర్థాలు ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. శాంతినగర్, టీటీడీ కల్యాణమండపం, పోలీస్ పెట్రోల్‌బంకు ఏరియాల్లో సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. ఫుట్‌పాత్‌ల వద్ద మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ బాపిరాజు, ఎంహెచ్‌వో డాక్టర్ మాలతి, ఎస్‌ఈ వెంకటేశ్వరరావు, భాస్కరరావు, ఏపీపీ శాంతిలత పాల్గొన్నారు.
Updated Date - 2022-12-31T22:39:14+05:30 IST