ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల పట్టాలు వెంటనే పంపిణీ చేయండి : జేసీ

ABN, First Publish Date - 2022-05-24T05:42:42+05:30

జగనన్న ఇళ్ల పథకం కింద ఇళ్ల స్థలాలు పట్టాలు మంజూరైన వారందరికీ పూర్తిస్థాయిలో పట్టాలు పంపిణీ చేపట్టా లని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న జేసీ అరుణ్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు రూరల్‌,మే 23 : జగనన్న ఇళ్ల పథకం కింద ఇళ్ల స్థలాలు పట్టాలు మంజూరైన వారందరికీ పూర్తిస్థాయిలో పట్టాలు పంపిణీ  చేపట్టా లని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జగనన్న ఇళ్లు, ఓటీఎస్‌, రెవెన్యూ కార్యక్రమాలు తదితర అంశాలపై జిల్లాలోని తహసీల్దార్లతో ఆయన సమీక్షించారు.  ఏలూరు డివి జన్‌లో 69,740 మందికి స్థలాలు మంజూరు కాగా వారిలో 58,681 పట్టాలు పంపిణీ చేశామని ఇంకా 1159 మందికి పట్టాలు పంపిణీ చేయాల్సి ఉంద న్నారు. పట్టాలు ఇంకా పంపిణీ చేయకపోవడంపై తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యం చేసిన తహసీల్దార్లపై చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. 90 రోజుల్లో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం కింద దర ఖాస్తులు తక్షణం పరిష్కరించాలన్నారు. అనంతరం రీసర్వే, ఓటీఎస్‌, రెవెన్యూ కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. డీఆర్వో వైవీ సత్యనారాయణ మూర్తి, ఆర్డీవో పెంచల కిషోర్‌, కె.రాజ్యలక్ష్మి, కె.ఝాన్సీరాణి పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-24T05:42:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising