ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూడికెప్పుడు?

ABN, First Publish Date - 2022-09-11T06:16:04+05:30

నరసాపురం తీర ప్రాంతం బొండు ఇసుకకు పెట్టింది పేరు. జిల్లాలోని లే అవుట్‌లు, ఇళ్ల నిర్మాణ సమ యంలో పూడికకు ఇక్కడ ఇసుకనే వాడుతుంటారు.

నరసాపురం తీర ప్రాంతంలో ఎక్స్‌కవేటర్‌ సాయంతో లారీలోకి తోడుతున్న ఇసుక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందుబాటులో చుట్టూ బొండు ఇసుక

అయినా పూడికకు నోచుకోని జగనన్న ఇళ్ల స్థలాలు 

నిత్యం వందలాది లారీల్లో  ఇతర ప్రాంతాలకు తరలింపు

రెండేళ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపులు

పట్టించుకోని పాలకులు, అధికారులు


నరసాపురం, సెప్టెంబరు 10: నరసాపురం తీర ప్రాంతం బొండు ఇసుకకు పెట్టింది పేరు. జిల్లాలోని లే అవుట్‌లు, ఇళ్ల నిర్మాణ సమ యంలో పూడికకు ఇక్కడ ఇసుకనే వాడుతుంటారు. నిత్యం వందలాది లారీల్లో ఇక్కడ నుంచి ఇసుక తరలిపోతోంది. అనధికారికంగా నిత్యం లక్షల్లో వ్యాపారం సాగుతుంది. అలాంటి ఈ ప్రాంతంలో జగనన్న కాలనీల పూడికకు బొండు ఇసుక/మట్టి దొరకపోవడం గమనార్హం. రెండేళ్లుగా సేకరించిన స్థలాలను మట్టి లేక పూడ్చలేకపోయారు. పట్టణంలోని రుస్తుంబాద పంచాయతీ పరిధిలోని మంగళగుంట పాలెంలో సేకరించిన 92 ఎకరాలు దీనికి నిదర్శనం. రుస్తుంబాద పంచాయతీ పరిధిలోని మంగళకుంటపాలెం వద్ద ఇళ్ల స్థలాల కోసం 92 ఎకరాలు సేకరించారు. పట్టణ పరిధిలోని 4,440 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఆరు నెలల్లో పూడిక పనులు పూర్తిచేసి కాలనీలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని నేతలు హామీలు గుప్పించారు. రెండేళ్లు అయినా కేవలం 22 ఎకరాల్లో పూడిక పూర్తయింది. మరో పది ఎకరాలను అసంపూర్తిగా పూడ్చారు. మిగిలిన 60  ఎకరాలు పూడికకు ఎదురు చూస్తున్నాయి. లబ్ధిదా రులు పనులు పూర్తయితే ఇళ్లు కట్టుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. పట్టా తీసుకుని ఏళ్లు గడుస్తున్నా... వారి సొంతింటి మాత్రం నెరవేరడం లేదు. 


 తరలిపోతున్న ఇసుక

చీకటి పడిందంటే చాలు తీర ప్రాంతంలో లారీల శబ్దమే విన్పిస్తుంది. జిల్లాలోని ఇతర ప్రాంతాలతో పాటు సరిహద్దు జిల్లాలకు బొండు ఇసుక తరలిపోతుంది. జిల్లాలో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులకు ఇక్కడ నుంచే ఇసుక వెళ్తుంది. అంత పుష్కలంగా పూడికకు ఇసుక దొరుకుతున్న సమీపంలో ఉన్న జగనన్న కాలనీకి రెండేళ్లుగా మట్టి దొరక్కపోవడం గమనార్హం. 


 రూ.7 కోట్లు విడుదల

ఈ ఏడాది ఆరంభంలో పూడిక పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం రూ.7 కోట్లు విడు దల చేసింది. నెలలు గడుస్తున్నా పనుల్లో పురోగతి లేదు.  అధికారులు చెప్పుతున్న వివరణ మరోలా ఉంది. సేకరించిన స్థలం  బొండు ఇసుక దొరికే ప్రాంతానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంత దూరం నుంచి ట్రాక్టర్ల ద్వారా తీసుకొస్తే ప్రభుత్వం ఇస్తున్న ధర గిట్టుబాటు కాదని కాంట్రా క్టర్లు ముందుకు రావడం లేదని చెబుతున్నారు. నేతలు, అధికారులు దృష్టి పెడితే తమ స్థలాల పూడిక ఎప్పుడో పూర్తయ్యేదని లబ్ధిదారులు వాపోతున్నారు.  


తాళ్ళకోడు  కాలనీ జలమయం

ఆకివీడు రూరల్‌ : తాళ్ళకోడు కాలనీ ఇళ్ల స్థలాల్లోకి వర్షపునీరు చేరింది. రోడ్లన్నీ బురద మయయ్యాయి. అడుగు పెట్టడానికి వీలు లేకుండా పోయిందని ఇళ్లు నిర్మించుకుని లబ్ధ్దిదా రులు లబోదిబోమంటున్నారు. కరెంటు లేదు, తాగునీరు లేదు, వాడు కోవడానికి ఏర్పాటు చేసిన మోటారు చెడి పోయిందని గగ్గోలు పెడు తున్నారు. చీకటి పడిందంటే భయానకంగా ఉంటుందని వాపోతు న్నారు. గృహ ప్రవేశాలు చేసిన కొంతమంది ఇక్కడ ఉండ లేక  ఇళ్లకు తాళాలు వేసి మరల అద్దె ఇళ్లలోనికి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి పూడిక చేపట్టి మౌలిక వసతు లు కల్పించక పోతే ఇక్కడ ఉండలేమని చెబుతున్నారు.

Updated Date - 2022-09-11T06:16:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising