ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భీమవరంలో అంతర్జాతీయ చెస్‌ టోర్నీ ప్రారంభం

ABN, First Publish Date - 2022-09-29T05:33:44+05:30

అంతర్జాతీయ చదరంగ పోటీలకు భీమవర ప్రాంతం వేదిక కావడం గర్వకారణంగా ఉందని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు.

పోటీలు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రామరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం అర్బన్‌, సెప్టెంబరు 28: అంతర్జాతీయ చదరంగ పోటీలకు భీమవర ప్రాంతం వేదిక కావడం గర్వకారణంగా ఉందని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఢీల్లీ పబ్లిక్‌ స్కూల్లో డా. తటవర్తి శ్రీరామారావు మెమోరియల్‌ ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ ఫిడే రేటెడ్‌ చెస్‌ టోర్నమెంట్‌ను తట్టవర్తి నవీన్‌, డా. ఇర్రింకి సూర్యారావు, వత్సవాయి శ్రీనివాసరాజు చెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌. భీమారావుతో కలిసి బుధవారం ప్రారంభించారు. సూర్యమిత్ర ఎగ్జిమ్‌ ప్రైవేట్‌ లిమిటేడ్‌ అధినేత డా. ఇర్రింకి సూర్యారావు, యునోఫిడ్స్‌ డైరెక్టర్‌ తట్టవర్తీ నవీన్‌ మాట్లాడుతూ నూతనంగా జిల్లా కేంద్రాంగా ఏర్పడిన పట్టణంలో అంతర్జాతీయ టోర్నమెంట్‌ జరగడం అభినందనీయమమ న్నారు. చెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌. భీమారావు, స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కె. కృష్ణారావు, జిల్లా చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాదాసు కిషోర్‌ మాట్లాడారు. కార్యక్రమంలో చెస్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి గమిని రవి పవన్‌, ఉపాధ్యక్షుడు తోట హరిబాబు, గౌతమి, చెస్‌ అసోసియేషన్‌ సభ్యుడు అల్లూరి శివరామరాజు, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. చీఫ్‌ ఆర్బిటర్‌గా జీవీ కుమార్‌ వ్యవహరించారు.

Updated Date - 2022-09-29T05:33:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising