ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

21 నుంచి ప్రి ఫైనల్‌

ABN, First Publish Date - 2022-02-16T06:34:22+05:30

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు ఏర్పాట్లను పూర్తి చేసినట్టు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.చంద్రశేఖర బాబు వెల్లడించారు.

ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.చంద్రశేఖర బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్‌ పరీక్షలకు 74,832 మంది విద్యార్థులు

ఏర్పాట్లు పూర్తి : ఆర్‌ఐవో చంద్రశేఖర్‌

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 15 : ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు ఏర్పాట్లను పూర్తి చేసినట్టు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.చంద్రశేఖర బాబు వెల్లడించారు. మంగళ వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఈ నెల 21 నుంచి మార్చి రెండో తేదీ వరకు ప్రి ఫైనల్‌ పరీక్షలు జరుగుతాయి. ప్రాక్టికల్స్‌ జనరల్‌ విభాగం విద్యార్థులకు 138 కేంద్రాల్లోను, ఒకేషనల్‌ విద్యార్థులకు 50 కేంద్రాల్లోను నాన్‌ జంబ్లింగ్‌ విధానంలో నిర్వహిస్తాం. థియరీ పరీక్షలు 109 కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుపుతాం. ప్రాక్టికల్స్‌కు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 24,438 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. ఇంటర్‌ పరీక్షలకు 74 వేల 832 మంది రిజిస్టర్‌ చేసుకోగా, వీరిలో జనరల్‌ విద్యార్థులు 65 వేల 805 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 9 వేల 27 మంది ఉన్నారు. ఫస్టియర్‌ పరీక్షలకు జనరల్‌ విభాగం 34,250 మంది, ఒకేషనల్‌ విభాగం 4,811 మంది, సెకండియర్‌ పరీక్షలకు జనరల్‌ విభాగం 31,555 మంది, ఒకేషనల్‌ 4,216 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. థియరీ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి. నైతికత, మానవ విలువలు పరీక్ష మార్చి 7న ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, పర్యావరణ విద్య పరీక్ష మార్చి 9న, ప్రాక్టికల్స్‌ 11 నుంచి 31 వరకు రోజుకు రెండు సెషన్లలో జరుగుతాయి’ అని చంద్రశేఖర్‌ తెలిపారు. 

Updated Date - 2022-02-16T06:34:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising