ఆయిల్ కథేంటో తేల్చండి..!
ABN, First Publish Date - 2022-08-04T05:34:36+05:30
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో పెద్ద ఎత్తున ఆయిల్ కుంభకోణం జరిగిన వైనంపై జిల్లా యంత్రాంగం బుధవారం విచారణకు ఆదేశించింది.
ఆంధ్రజ్యోతి కఽథనంపై స్పందించిన కలెక్టర్
ఏలూరు కార్పొరేషన్లో అవినీతిపై విచారణ
విచారణాధికారిగా జేసీ అరుణ్‌బాబు
నివేదిక తరువాత చర్యలకు సిద్ధం
ఏలూరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో పెద్ద ఎత్తున ఆయిల్ కుంభకోణం జరిగిన వైనంపై జిల్లా యంత్రాంగం బుధవారం విచారణకు ఆదేశించింది. నిజానిజాలను వెలుగు తీసేందుకు విచారణ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ్‌బాబును నియమిస్తూ కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ ఉత్త ర్వులు జారీ చేశారు. ‘అన్నా.. మింగేస్తున్నారు’ శీర్షికపై ఆంధ్ర జ్యోతిలో బుధవారం ప్రత్యేక కధనం ప్రచురితమైంది., ఏలూ రు కార్పోరేషన్లో వరుసగా చోటు చేసుకుంటున్న అవినీతి అక్రమాలను ఇంతకుముందే అనేక కఽథనాలను ప్రచురించ డమే కాకుండా తాజాగా అధికార పార్టీ కార్పొరేటర్ ఒకరు కుంభకోణాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తూ ఒక లేఖ రాశారు. ఈ అంశం అధికార పార్టీలో కలకలం రేపింది. ఏలూరు కార్పోరేషన్లో జరుగుతున్న దందా వెనుక కొందరి ‘పెద్దల’ భాగోతం ఉన్నట్టు సీఎంకు పంపిన లేఖలో పేర్కొ నడం తాజా పరిణామం. ఇప్పటికే ఆశీల దగ్గర నుంచి ఇతర కార్యకలాపాలపైన కొందరి కనుసన్నల్లోనూ అవినీతి రాజ్యమేలుతున్న వైనాన్ని ఆంధ్రజ్యోతి కఽథనాల్లో స్పష్టత ఇచ్చింది. తాజాగా ఆయిల్ కుంభకోణంపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ఆయిల్ కుంభకోణం అంశంపై జాయింట్ కలెక్టర్ అరుణ్‌బాబును విచారణ అధికారిగా నియమిస్తున్నాం. సమగ్ర విచారణ చేసి నివేధిక సమర్పించాల్సింగా ఆదేశించాం. నివేదిక అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామ’ని జిల్లా కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఏలూరు కార్పొరేషన్లో చోటు చేసుకుంటున్న అవినీతి భాగోతాలపై ఆయిల్ కుంభకోణం ఒక పరాకాష్టగా భావించడమే కాకుండా లోతట్టు విచారణకు కలె క్టరే చొరవ తీసుకుని తక్షణ చర్యలకు ఆదేశించడంతో మున్సి పల్ కార్పోరేషన్లో తీవ్ర కలకలం రేపింది. ఈ అంశంపై కార్పోరేటర్ల మధ్య తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఏలూరు కార్పొరేషన్లో వరుసగా జరుగుతున్న కుంభకోణాలపై ఆంధ్ర జ్యోతి కథనాలు ప్రచురించినా ఏమాత్రం ఖాతరు చేయకుండా మొండిగా వ్యవహరించిన మేయర్ ఇప్పుడు తాజాగా తామే విచారణ కోరినట్టుగా సరికొత్త ప్రయత్నానికి తెరతీశారు.
మేమే చేయమన్నాం : మేయర్ నూర్జహాన్
ఏలూరు కార్పొరేషన్‌పై బురద జల్లుతూ దుష్ఫ్రచారం చేస్తూ కుట్రలు పన్నుతున్న వారి వివరాలను ప్రజలకు తెలి యజేసేందుకే స్వయంగా తాను ఎమ్మెల్యే ఆళ్ల నాని కలసి జిల్లా కలెక్టర్ ద్వారా తాజా అంశాలపై విచారణ చేయించాలని అభ్యర్థించినట్టు ఏలూరు కార్పొరేషన్ మేయర్ నూర్జహాన్ రాత్రి పొద్దిపోయిన తరువాత ఒక ప్రకటనను జారీచేశారు. సీఎం మార్గదర్శకత్వంలో అవినీతికి తావు లేకుండా ఏలూరు నగ రాన్ని ఎమ్మెల్యే ఆళ్ల నాని సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవానికి అధికార పార్టీ కార్పొరేటర్ సీఎం జగన్‌కు జూలైలోనే ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసి మేయర్ కనీసం స్పందించలేదు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు కూడా ప్రయత్నించలేదు. కాగా ఆంధ్రజ్యోతి కథనంపై కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించగానే ఆ విచారణను తామే చేయించుకుంటున్నామనే ప్రచారం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించడం విడ్డూరం.
Updated Date - 2022-08-04T05:34:36+05:30 IST