ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీడియాతో సమన్వయం చేసుకోవాలి

ABN, First Publish Date - 2022-05-26T06:33:19+05:30

మీడియాతో సమన్వయం చేసుకోవాలి

మాట్లాడుతున్న సమాచార శాఖ కమిషనర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమాచార కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి
భీమవరం, మే 25 : ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాలని రాష్ట్ర సమాచార పౌర సంబం ధాల శాఖ కమిషనర్‌ టి.విజయ్‌ కుమార్‌రెడ్డి ఆదేశించారు. మీడి యాతో సమన్వయం చేసుకుం టూ సమర్ధవంతంగా పనిచేయా లన్నారు. బుధవారం భీమవరం కలెక్టరేట్‌ ఆవరణలోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయాన్ని కమిషనరు సందర్శించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు సమాచార సిబ్బంది, పాత్ర, తదితర అంశాలపై ఆయన సిబ్బందితో సమీక్షించారు. మన వృత్తిని సరైన విధానంతో నిర్వర్తిస్తూ ముందుకు వెళితే ప్రజలకు చాలా మేలు చేసినవారవుతామన్నారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ డిజిటల్‌, సోషల్‌ మీడియాను వినియోగించుకోవాలన్నారు. అడిషనల్‌ డైరెక్టర్‌ ఎల్‌.స్వర్ణలత, డిప్యూటీ డైరెక్టర్‌ పి.తిమ్మప్ప, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి.నాగార్జున, అడిషనల్‌ పిఆర్వో టి.నాగేశ్వరరావు, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజనీర్‌ సీహెచ్‌ బాబురావు, సీనియర్‌ అసిస్టెంట్‌ కెటిఎంకెఎన్‌ఎస్‌ రాజు, పబ్లిసిటీ అసిస్టెంట్‌ సిహెచ్‌ శ్రీనివాస్‌ నెహ్రు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-26T06:33:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising