ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీడియా స్వేచ్ఛను కాపాడుకోవాలి

ABN, First Publish Date - 2022-12-12T00:08:38+05:30

ప్రజాస్వామ్య మనుగడకు మీడి యా స్వేచ్ఛను కాపాడుకోవాలని ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.

సుబ్బారావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న శ్రీనివాసరెడ్డి, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి

తాడేపల్లిగూడెం రూరల్‌, డిసెంబరు 11 : ప్రజాస్వామ్య మనుగడకు మీడి యా స్వేచ్ఛను కాపాడుకోవాలని ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలో ఇటీవల కన్ను మూసిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సీనియర్‌ పాత్రికేయుడు వానపల్లి సుబ్బారావు సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. ‘మీడియా స్వేచ్ఛ పాలకులకు నచ్చడం లేదు. మీడియాపై అణచివేత ధోరణితో, అసహ నంతో ప్రవర్తిస్తున్నారు. వర్కింగ్‌ జర్నలిస్ట్‌ చట్టం రద్దు చేసి విలేకరులకు గల హక్కులను, సంక్షేమ పథకాలను తీసేశార’ని అన్నారు. ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు డి.సోమసుందర్‌ మాట్లాడుతూ సుబ్బారావు చివరి క్షణం వరకు వృత్తిపై మమకారంతో పనిచేశారని, జర్నలిస్టుల సమస్యలపై నిబద్ధతతో నిలబడ్డారన్నారు. శనివారం కన్నుమూసిన పాత్రికేయులు ఎస్‌కే శ్రీనివాసరెడ్డి, రావూరి చెన్నకేశవకు సంతాపం తెలుపుతూ రెండు నిముషాలు మౌనం పాటించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీరామ్మూర్తి, జిల్లా అధ్యక్షులు జీవీఎస్‌ఎన్‌ రాజు, కన్వీనర్‌ గజపతి వరప్రసాద్‌, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు చిక్కాల రామకృష్ణ, రవికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T00:08:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising