ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భానుడు భగభగ.. జనం విలవిల

ABN, First Publish Date - 2022-05-24T06:31:10+05:30

సోమవారం భానుడు నిప్పులు చెరిగాడు.

కైకలూరులో జాతీయరహదారిపై తగ్గిన జన సంచారం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోమవారం వడగాల్పులకు అల్లాడిన ప్రజలు

రోడ్లపై తగ్గిన జన సంచారం

కాయలు రాలి మామిడి రైతుల ఆందోళన

సోమవారం   భానుడు నిప్పులు చెరిగాడు. ఎండకు తోడు వడగాలులతో జనం అల్లాడారు.  మధ్యాహ్నానికి రోడ్లన్నీ బోసిపోయాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పలువురు తమ ప్రయాణాలు మానుకున్నారు. రోహిణికి ముందే ఎండలు ఇలా ఉంటే రోహిణికార్తెలో ఇంకెలా ఉంటాయోనని  ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

చాట్రాయి, మే 23: ఎండలు తీవ్రరూపం దాల్చటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. సోమవారం చాట్రాయిలో  44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  కూలీలు ఉదయం 6 గంటలకే పనులకు వెళ్ళి 12 గంటలకు ఇళ్ళకు చేరుకుంటున్నారు. ఫ్యాన్లు, కూలర్ల నుంచి  వేడిగాలి వస్తుండటంతో వృద్దులు, చిన్నపిల్లలు, రోగులు, గర్భిణులు ఆపసోపాలు పడుతున్నారు.  వడగాల్పులకు భయపడి ప్రజలు ఇళ్ళకే పరిమిత మవటంతో మధ్యాహ్న సమయంలో వీధులన్నీ నిర్మానుషమ వుతున్నాయి. వ్యాపారులు కూడా మధ్యాహ్నం పూట దుకాణాలు మూసివేస్తుండటంతో వీధులు బోసిపోతున్నాయి.  బస్సుల్లో పెద్దగా ప్రయాణికులు ఉండటం లేదు.  శీతల పానీయాలకు డిమాండ్‌ ఏర్పడింది. రోహిణీ కార్తెలో ఎండ ఎలా ఉంటుందోనని   ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ముసునూరు: భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడుతు న్నారు. ఉదయం ఏడు గంటల నుంచే ఎండ, వడగాలులు ప్రారంభమై, సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగు తుండటంతో ప్రధాన రహదారులు నిర్మానుషంగా మారుతున్నాయి. విద్యుత్‌ సరఫరాలో కోతలు విధించటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఆగిరిపల్లి: మూడు రోజులుగా వడగాలులు జనాన్ని ఠారెత్తిస్తున్నాయి.  మరో వారం రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందన్న వార్తలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వడగాల్పులు ప్రారంభం కావడంతో మామాడి తోటల్లో కాయలు పండి నేలరాలు తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎండ తీవ్రతకు కూలీలు కూడా రాకపోవడంతో మామిడి కాయలు సకాలంలో కోయలేక రైతులు నష్టపోతున్నారు. వడగాలి ఇలాగే కొనసాగితే మరో వారంలో మామిడితోటలు ఖాళీ అయిపోతాయని అంటున్నారు.

ముదినేపల్లి: ముదినేపల్లిలో సోమవారం 43 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటలకే వడగాల్పులు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల  నుంచే వ్యాపార సంస్థలు వెలవెలబోయాయి. గురజ  రోడ్డు సెంటర్‌లోని వారపు సంతకు జనం కరువయ్యారు.  జాతీయ  రహదారి నిర్మానుషంగా కనిపించింది. ముదినేపల్లి – వడాలి మధ్య చెట్ల నీడన శీతల పానీయాలు సేవిస్తూ జనం సేద తీరారు. 

కైకలూరు: వడగాల్పులకు కైకలూరులోని ప్రధాన రహదార్లు జన సంచారం లేక వెలవెలబోయాయి. సోమ వారం ఉదయం నుంచే ఎండ తీవ్రతతో వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాల్లో  జనసంచారం తగ్గింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కైకలూరు తాలుకా సెంటర్లోని జాతీయ రహదారి నిర్మానుష్యంగా ఉంది. సాయంత్రం వరకు వడగాల్పులు ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Updated Date - 2022-05-24T06:31:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising