కుండపోత
ABN, First Publish Date - 2022-08-04T07:03:28+05:30
గడచిన 24 గంటల్లో ఏలూరు జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిసాయి.
జిల్లాలో భారీ వర్షం.. నూజివీడులో అత్యధికం.. పొంగిన కొండవాగులు..
ఏలూరు సిటీ, ఆగస్టు 3 : గడచిన 24 గంటల్లో ఏలూరు జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిసాయి. నూజివీడులో అత్యధికంగా 143.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా జిల్లా సరాసరి వర్షపాతం 36.7 మి.మీ. మిగిలిన ప్రాంతాల్లో వివరాలివి.. కొయ్యలగూడెం 106.8, పెదవేగి 106.4, కలిదిండి 70.8, చింతలపూడి 65.2, ఆగిరిపల్లి 60.2, దెందులూరు 58.4, ముసునూరు 57.2, చాట్రాయ్ 56.4, భీమడోలు 47.8, లింగ పాలెం 44.8, పెదపాడు 40.4, కుక్కునూరు 34.4, గణపవరం 25.4, నిడమర్రు 23.8, ఏలూరు 22.2, ద్వారకా తిరుమల 22, ఉంగుటూరు 13.8 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీగా వర్షాల కారణంగా పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. డెల్టాలోని వరి చేలల్లో నీరు నిలిచింది. మిగిలిన మండలాల్లో సార్వా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వర్షాల వల్ల రహదారులు మరింత అధ్వానంగా తయారయ్యాయి.
పెదవేగి : ఈ సీజన్‌లోనే రికార్డు స్థాయిలో 106.2 మిల్లీమీటర్ల వర్షపాతం మంగళవారం రాత్రి నమోదైంది. ఈ కారణంగా వాగులు, వంకలు ఏకమయ్యాయి. పండ్ల తోటలు చెరువుల్లా మారాయి. గంటన్నరపాటు ఎడతెరిపి లేకుండా కురవడంతో నీరు డ్రెయిన్ల నుంచి రోడ్లపైకి ఎక్కి ప్రవహించాయి. పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వాగులు ఉధృతం
టి.నరసాపురం : మక్కినవారిగూడెం, బండివారిగూడెం గ్రామాల పరిధిలోని జల వాగు, ముగ్గురాల వాగులు ఉధృతంగా పొంగి ప్రవహించడంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. తెలంగాణ రాష్ట్రానికి మక్కినవారిగూడెం, మర్రిగూడెం గ్రామ పంచాయతీలు సరిహద్దులో ఉం డటంతో ఆ ప్రాంతంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి జలవాగులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో మక్కిన వారిగూడెం– టి.నరసాపురం గ్రామాల మధ్యలో దుర్గమ్మ గుడి వద్ద గల జలవాగు, మక్కినవారి గూడెం – బండివారిగూడెం గ్రామాల మధ్య గల ముగ్గురాల వాగు వంతెనలపై నుంచి ప్రమాద స్థాయిలో పొంగి ప్రవహించడంతో ఆయా మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వాగుల ఉధృ తికి వాహనదారులు గంటల తరబడి నిలిచిపోయారు. వాగులో నుంచి వాహనాలను నడపడంతో ఒక ద్విచక్ర వాహనం అదుపు తప్పి త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రమా దాలు జరగకుండా పోలీసులు వాగు వద్ద ఏర్పాట్లు చేశారు.
Updated Date - 2022-08-04T07:03:28+05:30 IST