త్రివర్ణ సందడి
ABN, First Publish Date - 2022-08-05T05:16:08+05:30
స్వాంత్రత్య సమర యోధుల పోరాటాలు, ప్రాణత్యాగంతో దేశ ప్రజలకు స్వేచ్ఛ లభించిందని ఆర్డీవో దాసి రాజు అన్నారు.
జాతీయ పతాకం ఆవిష్కరణలు, ర్యాలీ
భీమవరం టౌన్, ఆగస్టు 4: స్వాంత్రత్య సమర యోధుల పోరాటాలు, ప్రాణత్యాగంతో దేశ ప్రజలకు స్వేచ్ఛ లభించిందని ఆర్డీవో దాసి రాజు అన్నారు. ఆజాదికా అమృతోత్సవంలో భాగంగా శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో చిన రంగనిపాలెం మునిసిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 75 అడుగుల జాతీ య జెండాతో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ సమర యోధుల చరిత్రను నేటి తరం వారికి తెలియజెప్పాలన్నారు. ఇటువంటి కార్యక్రమాలతో విద్యార్ధుల్లో దేశభక్తిని పెంపొందించవచ్చునని అన్నారు. హెచ్‌ఎం కోడే వెంకట్రావు, చెరకువాడ రంగసాయి, ఉండపల్లి రమేష్‌నా యుడు ఆరసవల్లి సుబ్రహ్మణ్యం, నరహరిశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌ఐసీ బ్రాంచి కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఇంటింటా జెండా, ఇంటింటా బీమా అనే నినాదందతో మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి డివిజనల్ ఆఫీసర్ ప్రసాదరావు ముఖ్యఅతిఽధిగా పాల్గొన్నారు. ఎం.శ్రీనివాసరావు, జీఆర్.రాథాకృష్ణ, ఎం.శ్రీనివాస్, వై.జాన్‌బా బు, పిఆర్‌కెరాజు, టిఎల్‌ఎన్‌మూర్తి, మైగాపులనాయుడు పాల్గొన్నారు.
భీమవరం ఎడ్యుకేషన్: నేటితరం యువత రేపటి భావితరాలకు పునాదులని ఎస్పీ యు.రవిప్రకాష్ అన్నారు. పీఎస్‌ఎం బాలికల హైస్కూల్ లో గురువారం ఆజాది కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకుని దేశభక్తి పాటల పోటీలు నిర్వహించారు. విద్యార్ధులు దేశభక్తితో ప్రవర్తించాలని ఎస్పీ హితవు పలికారు. ఎస్‌ఈబీ ఏఎస్పీ రవికుమార్ పాల్గొన్నారు.
Updated Date - 2022-08-05T05:16:08+05:30 IST