ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలు

ABN, First Publish Date - 2022-08-10T05:30:00+05:30

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా నూజివీడు పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు.

నూజివీడులో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కైకలూరులో జాతీయ జెండాల పంపిణీ

నూజివీడు టౌన్‌, ఆగస్టు 10: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా నూజివీడు పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్‌ నేతృత్వంలో పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు రాష్ర్టీయ స్వయం సేవక్‌ సంఘ్‌ సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు. చిన్న గాంధీ బొమ్మసెంటర్‌ నుంచి వేంకటేశ్వరస్వామి కోవెల, పెద గాంధీ బొమ్మసెంటర్‌, ద్వారకాసెంటర్ల మీదుగా 25 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు బోను అప్పారావు, రాష్ట్ర కార్యవర్గ మాజీ సభ్యుడు వై.ఎస్‌ దొరై, జిల్లా ఉపాధ్యక్షుడు ఆముదాల ఇస్సాకు, జిల్లా కార్యదర్శి వసుందరాదేవి, కోశాధికారి రవికాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆగిరిపల్లి, ఆగస్టు 10 : నూగొండపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యా ర్థులతో బుధవారం బీజేపీ మండల నాయకులు హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆజాదీ కా అమృత మహోత్సవ్‌లో భాగంగా ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటా లన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం సీహెచ్‌.వల్లభరాజు, జి.రామచంద్రరావు, బీజేపీ మండల అధ్యక్షుడు కొవ్వలి బాబూరావు, ఉపాధ్యక్షుడు రెడ్డి రామారావు తదితరులు పాల్గొన్నారు.

ముసునూరు, ఆగస్టు 10 : జాతీయ జెండా గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని గ్రంథలయ అధికారి సునీల్‌కుమార్‌ అన్నారు. బుధవారం హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా గోపవరం జడ్పీ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు జాతీయ జెండాలతో గ్రామ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు స్వాతంత్య్ర స్ఫూర్తినిచ్చే అంశాలపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఉపాధ్యాయులు పి.శ్రీధర్‌, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

కైకలూరు, ఆగస్టు 10 : మహనీయుల త్యాగఫలం వల్ల దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు కీర్తి వెంకటరామ్‌ప్రసాద్‌ అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా బుధవారం కైకలూరులో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈనెల 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేయాలన్నారు. బీజేపీ నేతలు వెంకటశేషగిరి, బొల్లా శ్యామలరాజ్‌గౌడ్‌, కునుకు బలరామ్‌, కోనాల బలరామ రత్నారెడ్డి పాల్గొన్నారు. పార్టీ జిల్లా నాయకుడు లావేటి వీర శివాజీ ప్రారంభించిన పాదయాత్ర మూడోరోజు కొల్లేరు గ్రామాల్లో నిర్వహించారు. పందిరిపల్లెగూడెం, గుమ్మళ్ళపాడు గ్రామాల్లో స్వాతంత్య్ర ఉద్యమ నాయకుల త్యాగాలను తెలిపేవిధంగా ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. 



Updated Date - 2022-08-10T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising