ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : మంత్రి కొట్టు
ABN, First Publish Date - 2022-08-05T05:08:53+05:30
ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నామని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
పెంటపాడు, ఆగస్టు 4: ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నామని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పెంటపాడు గౌరీదేవి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొన్నారు. వెలమ యువజన సంఘం సభ్యులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి రూ.67 లక్షలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. వెలమ సంఘం కల్యాణ మండపానికి వంటషెడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటానన్నారు. జడ్పీ మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి, గొర్రెల శ్రీధర్, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-05T05:08:53+05:30 IST