ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగుజాతి చిరస్మరణీయులు గౌతు లచ్చన్న: పేరం శివనాగేశ్వరరావు గౌడ్

ABN, First Publish Date - 2022-08-17T01:06:31+05:30

అఖిల భారత గౌడ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ దాసరి శ్యాం చంద్ర శేషు అధ్యక్షతన జంగారెడ్డిగూడెంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): అఖిల భారత గౌడ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ దాసరి శ్యాం చంద్ర శేషు అధ్యక్షతన జంగారెడ్డిగూడెంలో గౌతు లచ్చన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత గౌడ సంఘం జాతీయ అధ్యక్షుడు పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో లచ్చన్న అలుపెరగని పోరాటం చేశారన్నారు. చాలా సార్లు అరెస్టు కావడంతో బ్రిటిష్ ప్రభుత్వం కాల్చివేత ఆర్డర్స్ పాస్ చేసి లచ్చన్న తలపై పది వేల రూపాయలు రివార్డు ప్రకటించడం ఆయన పోరాట స్ఫూర్తికి నిదర్శనమని కొనియాడారు. 


‘‘రైతు నాయకుడిగా గౌతు లచ్చన్న చాలా రైతు కార్యక్రమాలు చేశారు. బహుజన నాయకుడిగా బలహీన వర్గాల కోసం చాలా ఉద్యమాలు చేశారు.  బలహీన వర్గాల అభివృద్ధికి లచ్చన్న హితోదికమైన కృషి చేశారు. ఈ దేశంలో ప్రజల చేత సర్దార్ బిరుదు పొందిన మహనీయుడు గౌతు లచ్చన్న.  ఆయన పోరాటం చూపిన మార్గం నేడు ఎందరికో ఆదర్శనీయమైంది. గౌతు లచ్చన్న బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టి ఆయన చరిత్ర కొంత మరుగున పడింది. అదే వేరే కులానికి చెందిన నాయకుడైతే మరొక సర్దార్ వల్లభాయ్ పటేల్‌గా కీర్తించేవారు. భారతరత్న అందుకునే అర్హత లచ్చన్నకు ఉంది. కాబట్టి వెంటనే భారతరత్న ప్రకటించాలి.’’ పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ డిమాండ్ చేశారు..


ఇక గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిలర్ పడమటి చంద్రరావు, గౌడ సంఘ నాయకులు బత్తినచిన్న, మేక సింహాద్రి, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, మారిసెట్టి తాతాజీ, గుబ్బల సత్యవేణి మార్గాన్ని సుసీల, రాజులపాటి అన్నవరం, గురవయ్య, కాసాని ప్రసాద్, పరస రాంబాబు, తల్లాడ సంజయ్, పడమటిగిరి, ఉడా నాగరాజు, కొప్పుల దుర్గారావు, రాగాని రామకృష్ణ, పోసుబాబు, మన్యం దుర్గారావు, మిడతా రామకృష్ణ, మట్టా సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-17T01:06:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising