ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యాస్‌...మంట

ABN, First Publish Date - 2022-05-19T05:30:00+05:30

సామాన్య మధ్యతరగతి కుటుం బాల వారికి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ షాక్‌ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మళ్ళీ పెరిగిన వంట గ్యాస్‌ ధర

 మేనెలలోనే రెండు సార్లు పెరిగిన ధరలు

 సిలిండర్‌కు రూ.3.50 పెంపు 

 ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1028

 వినియోగదారుల గగ్గోలు


ఏలూరుసిటీ, మే 19: సామాన్య మధ్యతరగతి కుటుం బాల వారికి  కేంద్ర ప్రభుత్వం మళ్ళీ షాక్‌ ఇచ్చింది. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర (ఎల్‌పీజీ) మళ్లీ పెంచింది. ఈ సారి సిలిండర్‌కు రూ.3.50 మాత్రమే పెంచింది. ఈ నెలలో రెండు సార్లు వంట గ్యాస్‌ ధరలు పెంచింది. అంతర్జాతీ యంగా ముడి చమురు ధరలు పెరుగుదల కారణంగా వంట గ్యాస్‌ ధరలు పెంచక తప్పటం లేదని ఆయిల్‌ కంపెనీలు పేర్కొంటున్నాయి. గత మార్చి నెలాఖరులో వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర 50 రూపాయలు పెంచారు.  మళ్ళీ మేనెల మొదటి వారంలో 50 రూపాయలు పెంచారు. తాజాగా రూ.3.50 వరకు పెంచారు. తాజా ధరతో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సిలిండరు ధర రవాణా ఖర్చుల ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో రూ.1028 మరికొన్ని ప్రాంతా ల్లో రూ.1036 ధరలకు అమ్ముతున్నారు. ఈ పెరుగుదలను చూసి వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.

రోజువారీ వినియోగం 15వేలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 12.90 లక్షల వంటగ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. రోజువారీ 15వేల గ్యాస్‌ సిలిండర్లు వినియోగం జరుగుతోంది. తాజాగా పెరిగిన వంట గ్యాస్‌ ధరలతో  వినియోగదారులపై రోజువారీ 52,500 రూపాయల వరకు భారం పడుతోంది. 


Updated Date - 2022-05-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising