ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమకు గణపవరం!

ABN, First Publish Date - 2022-05-19T06:12:03+05:30

పశ్చిమకు గణపవరం!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా కేంద్రానికి 20 కి.మీల దూరం .. 20కు చేరనున్న మండలాల సంఖ్య 

పశ్చిమ గోదావరి జిల్లాలోకి గణపవరం మండలం విలీనం చేస్తామని సీఎం జగన్‌ ప్రకటనతో ఆ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం ఏలూరుతో పోలిస్తే గణపవరం మం డలం భీమవరానికి దగ్గర. మండల కేంద్రం నుంచి 20 కిలో మీటర్లలోపు కొన్ని గ్రామాలు, 15 కి.మీ లోపు కొన్ని ఉన్నాయి. ప్రతీ అవసరానికి మండల ప్రజలందరూ భీమవరం వస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే విభజన ప్రకటించినప్పుడు ఈ మండల వాసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో ఈ మం డలాన్ని పశ్చిమలో చేరుస్తాని సీఎం ప్రకటించారు. ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. 


భీమవరం/గణపవరం, మే 18: గణపవరం ఒకప్పుడు ధాన్యాగారంగా ఉండేది. రైసు మిల్లుల పట్టణంగా పిలిచేవారు. ఇప్పుడు మంచినీటి చేపలు, రొయ్యల పెంపకానికి కేంద్రంగా మారింది. గణపవరం మండలం విస్తీర్ణం మొత్తం 100 కి.మీ, జనాభా 64,963, పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్తుతం 19 మండలాలతో ఏర్పాటైంది. గణపవరం కలిస్తే 20 మండలాలు, 2,278 చ.కి.మీ.. వైశాల్యం పెరుగుతుంది. జనాభా 18,44,963కు చేరుతుంది. 51933 ఓటర్లు 25గ్రామాలతో గణపవరం మండలం ఉంది. ఏలూరుకు 60 కిలోమీటర్లు దూరం కావడంతో ప్రజలు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. మండలానికి భీమవరం రెవెన్యూ డివిజన్‌ 20 కిలోమీటర్లే కావడంతో విద్యా, వైద్యం, వ్యాపార లావాదేవీలు మరింత అందుబాటులోకి వస్తా యని ప్రజలు సంతోషిస్తున్నారు. ఆక్వా ఎగుమతులకు భీమవరం ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ విలీనంతో ఆక్వా రైతాంగానికి మరెన్నో ప్రయోజనాలు సమకూరుతాయన్న భావన రైతుల్లో, ఈ ప్రాంత వాసుల్లో ఉంది.

జీఓ విడుదల చేయాలి
గణపవరం మండలాన్ని ప శ్చిమగోదావరి జిల్లా, భీమ వ రం డివిజన్‌లో విలీనం చే యాలని మండల పోరాట స మితి చేసిన ఉద్యమ ఫలి తమే సీఎం ప్రకటన. ఎమ్మెల్యే వాసుబాబుకు, అప్పటి మంత్రి శ్రీరంగనాథరాజుకు, శాసన మండలి చైర్మన్‌ మోషెన్‌రాజుకు సమితి వినతి పత్రాలు అందించింది. భీమవరంలో మండలాన్ని విలీ నం చేస్తున్నట్లు సీఎం ప్రకటించటం శుభ పరిణా మం. ప్రభుత్వం తక్షణం జీఓ విడుదల చేయాలి.
                                                  – నంద్యాల రామలింగరాజు, మండల పోరాట సమితి నాయకుడు
విలీనం మంచి నిర్ణయం
విలీనం తక్షణమే జరిగితే ప్ర జల ఆకాంక్షలు నెరవేరుతాయి. వైద్య, విద్యాపరంగా ఎంతో ఉప యోగం. ట్రెజరీ ఆఫీసు, కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాల సేవలు అం దుబాటులో ఉంటాయి. భీమ వరం ఎంతో సౌలభ్యంగా ఉంటుంది.
                                                                 – కూనిరెడ్డి సోమేశ్వరరావు, పోరాట సమితి నాయకుడు

Updated Date - 2022-05-19T06:12:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising