ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ వర్షం

ABN, First Publish Date - 2022-08-04T05:47:48+05:30

ఆకివీడు పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది.

తిమ్మరాజుకాలనీలో అంగన్‌వాడీ కేంద్రం వద్దకు చేరిన నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకివీడులో పల్లపు ప్రాంతాలు జలమయం
డ్రెయినేజీల ఆక్రమణతో క్షీణించిన నీటి పారుదల
వాహనదారులకు తప్పని ఇబ్బందులు


ఆకివీడు/ఆకివీడు రూరల్‌, ఆగస్టు 3 : ఆకివీడు పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలో డ్రెయినేజీలు ఆక్రమణకు గురి కావడంతో నీటి పారుదల క్షీణించడంతో రోడ్లపై నీరు నిలిచింది. రహదారులు కాల్వలను తలపించాయి. పల్లపు ప్రాంతాలు నీట మునగడంతో రాత్రంతా స్థానికులు ఇబ్బందులు ఎదు ర్కొన్నారు. బుధవారం ఉదయానికి కూడా కొన్నిచోట్ల నీరు లాగలేదు. మునిసిపాలిటీ హోదా వచ్చి రెండున్నరేళ్లు గడిచినప్పటికీ పాలకులు, అధికారులు ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుంపగడప గ్రామంలో పల్లపు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. వర్షపునీరు వెళ్లేందుకు మార్గం లేకపోవడం, డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షం కురిసిన ప్రతీసారి ఈ రోడ్డు నీటితో నిండిపోతుంది. తిమ్మరాజు కాలనీలోని అంగన్‌వాడీ భవనం చుట్టూ నీరు చేరడంతో  చిన్నారులకు ఇబ్బందులు తప్పలేదు. డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో నీరు వెళ్లే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నామని ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా స్థానికులు కోరుతున్నారు.





Updated Date - 2022-08-04T05:47:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising