ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జ్వరాలొస్తున్నాయ్‌

ABN, First Publish Date - 2022-01-23T05:51:09+05:30

మూడు రోజులుగా మంచు కమ్మేస్తోంది. ఉదయం 9 దాటినా చలి తగ్గడం లేదు. చలిగాలులు పెరిగాయి. ఈ వాతావరణ మార్పులతో జనం జ్వరాల బారిన పడుతున్నారు. జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులతో బాధపడుతున్నారు. ముందు జలుబు, దగ్గు వచ్చి ఒకట్రెండు రోజులు తగ్గి తరువాత జ్వరంగా మారుతుందని చెబుతు న్నారు.

దెందులూరులో ఇంటింటికి తిరిగి ఫీవర్‌ సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు రూరల్‌, జనవరి 22 : మూడు రోజులుగా మంచు కమ్మేస్తోంది. ఉదయం 9 దాటినా చలి తగ్గడం లేదు. చలిగాలులు పెరిగాయి. ఈ వాతావరణ మార్పులతో జనం జ్వరాల బారిన పడుతున్నారు. జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులతో బాధపడుతున్నారు. ముందు జలుబు, దగ్గు వచ్చి ఒకట్రెండు రోజులు తగ్గి తరువాత జ్వరంగా మారుతుందని చెబుతు న్నారు. ఏలూరుతోపాటు, భీమవ రం, తాడేపల్లిగూడెం, మొగల్తూరు, నరసాపురం, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో జ్వర పీడితులు ఆసుపత్రులకు క్యూ కడుతు న్నారు. ఏలూరు రూరల్‌ మండలంలోని పీహెచ్‌సీలకు ప్రతీ నలు గురిలో ఇద్దరు జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో వస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల ముందు జ్వర బాధితులు క్యూ కడు తున్నా రు.  కరోనా వేగంగా విస్తరిస్తుండడంతో మూడు రోజు లకు మించి జ్వరం ఉన్నవారు భయాందోళనలకు గురవుతున్నారు. వారం రోజు లుగా ఏలూరురూరల్‌ మండలంలో సుమారు 150 మందికిపైగా కొవిడ్‌ బారిన పడి స్వల్ప లక్షణాలతో ఇంట్లోనే చికిత్స పొందు తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే రకరకాల టెస్టులతో వేలాది రూపాయలు గుంజుతున్నారని, కరోనా పాజిటివ్‌ అని భయపెడు తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


10.55 లక్షల కుటుంబాలలో ఫీవర్‌ సర్వే 

ఏలూరుసిటీ, జనవరి 22: కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో జిల్లాలో 36వ విడత ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలో 13 లక్షల 59 వేల 39 కుటుంబాలుండగా ఇందులో ఇప్పటి వరకు 10 లక్షల 55 వేల 952 కుటుంబాల(77.7శాతం) సర్వే పూర్తిచేశారు.  ఈ సర్వేలో 655 మందికి సల్ప లక్షణాలున్న వారిగా గుర్తించి వారికి కొవిడ్‌ టెస్టులు నిర్వహించారు. ఇందులో ఇప్పటి వరకు 461 మందికి కొవిడ్‌ లక్షణాలు లేవని తేలింది. మరో 184 మందికి సంబంధించి టెస్టు ఫలితాలు రావాల్సి ఉంది. మిగిలిన 10 మందికి ఇంకా టెస్టులు నిర్వహించాల్సి ఉంది. సర్వేలో వైద్య, రెవెన్యూ సిబ్బంది, వలంటీర్లు పాల్గొంటున్నారు. 


Updated Date - 2022-01-23T05:51:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising