ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వణికిస్తున్న జ్వరాలు

ABN, First Publish Date - 2022-09-04T06:08:21+05:30

నరసాపురం తీర ప్రాం తంలో జ్వరాలు విజృంభిస్తు న్నాయి. పట్టణం, మండలా ల్లో ప్రతి ఇంటిలో ఇప్పటికే ఒకరో, ఇద్దరో జ్వరం బారినపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చినమామిడిపల్లిలో జ్వరంతో మహిళ మృతి

31వ వార్డులో మెడికల్‌ క్యాంపు ఏర్పాటు 

నరసాపురం, సెప్టెంబరు 3 : నరసాపురం తీర ప్రాం తంలో జ్వరాలు విజృంభిస్తు న్నాయి. పట్టణం, మండలా ల్లో ప్రతి ఇంటిలో ఇప్పటికే ఒకరో, ఇద్దరో జ్వరం బారినపడ్డారు. కొందరికి ప్లేట్‌లేట్స్‌ తగ్గి ఆస్పత్రుల్లో చేరి మెరుగైన వైద్యం తీసుకుంటే మరికొందరు ఇళ్ల వద్దే చికిత్స పొంది కోలుకున్నారు. పట్టణంలోని అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు జ్వర బాఽధితులతో నిండిపోయాయి. రోజువారి ఓపీల్లో ఈ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. మూడు రోజుల క్రితం పట్టణంలోని 31వ వార్డు చినమా మిడిపల్లి ప్రాంతానికి చెందిన  కె.అనంతలక్ష్మి(50) ప్లేట్‌ లేట్‌లు తగ్గి మృతి చెందింది. విషయం తెలుసుకున్న చీఫ్‌ విఫ్‌ ప్రసాదరాజు శనివారం మృతురాలి కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. శానిటేష న్‌ను మెరుగుపర్చి ఇంటింటా సర్వే చేయాలని అధికా రులను ఆదేశించారు. మరోవైపు వైఎస్‌ పాలెంలో 100 మందికి పైగా జ్వరం బారినపడ్డారు. వీరిలో కొందరు కోలుకోగా ఇంకా కొందరు ప్రైవేట్‌ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు. వైద్యశాఖ ఈ గ్రామంలో మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేసింది. వర్షాలు, పారిశుధ్యం, నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ఎక్కువ మంది జ్వరంతో మంచంపడుతున్నారు. దీనిపై డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ ప్రసాద్‌ వివరణ ఇస్తూ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంటింటా సర్వే చేయిస్తున్నాం. ఒకటి రెండు రోజుల్లో జ్వరం తగ్గకపోతే వైద్యుల్ని సంప్రదించాలి. తగిన పరీక్షలు చేయించుకోవాలి. అన్ని పీహెచ్‌సీల్లో మందులు సిద్ధం చేశామని తెలిపారు. 

Updated Date - 2022-09-04T06:08:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising