ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైనికుల త్యాగాలను ప్రతీ ఒక్కరూ స్మరించుకోవాలి

ABN, First Publish Date - 2022-08-12T05:18:48+05:30

దేశభద్రత కోసం ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి పోరాడిన సైనికులు త్యాగాలను కూడా 75 వసంతాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రతీ ఒక్కరూ స్మరించుకోవాలని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రి న్సిపాల్‌ ఎం.జగపతిరాజు అన్నారు.

ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సైనికుల కుటుంబాలకు సత్కారం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం ఎడ్యుకేషన్‌, ఆగస్టు 11 : దేశభద్రత కోసం ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి పోరాడిన సైనికులు త్యాగాలను కూడా 75 వసంతాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రతీ ఒక్కరూ స్మరించుకోవాలని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రి న్సిపాల్‌ ఎం.జగపతిరాజు అన్నారు. ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మరణించిన సైనికుల కుటుంబాలకు, యుద్ధంలో గాయపడిన సైనికులకు కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌, ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ సెల్‌ ఆధ్వర్యంలో గురువారం సత్కరించారు. భారత సైన్యం తరుపున శ్రీలంక వెళ్ళి ఎల్‌టీటీఈ దాడుల్లో గాయపడిన హవల్దార్‌ ఎ.త్రిమూర్తులు, క్రాఫ్ట్‌మెన్‌ ఎ.బాలాజీ, కార్గిల్‌వార్‌లో కుమారుడిని కోల్పోయిన జి.వెంకటలక్ష్మి, కార్గిల్‌ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుని భార్య యు అనురాధను కళాశాల ఉపాధ్యక్షులు ఎస్‌వి రంగరాజు, ప్రిన్సిపాల్‌ జగపతిరాజు ఘనంగా సత్కరించారు. రిటైర్డ్‌ సార్జెంట్‌ టి భోగేశ్వరరావు, రిటైర్డ్‌ సుబేదార్‌ యు రాజు, జిల్లా సైనిక సంక్షేమ శాఖాధికారి కెవిఎస్‌ ప్రసాదరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T05:18:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising