ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాతంత్య్ర సమరయోధుడు సూర్యనారాయణరాజు మృతి

ABN, First Publish Date - 2022-08-18T06:05:08+05:30

కాళ్ళ మండలం ఏలూరుపాడు గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, కృష్ణా, గోదావరి డెల్టా పరిరక్షణ సమితి, రైతు కార్యాచరణ సమితి గౌరవాధ్యక్షుడు మంతెన వెంకట సూర్యనారాయణరాజు (93) మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతు బాంధవుడిగా గుర్తింపు 


కాళ్ళ, ఆగస్టు 17 : కాళ్ళ మండలం ఏలూరుపాడు గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, కృష్ణా, గోదావరి డెల్టా పరిరక్షణ సమితి, రైతు కార్యాచరణ సమితి గౌరవాధ్యక్షుడు మంతెన వెంకట సూర్యనారాయణరాజు (93) మృతి చెందారు. రెండు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన భార్య సుభద్రయ్య ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. సూర్యనారాయణరాజుకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పదమూడో ఏట ఎస్‌ఎస్‌ఎల్‌సి చదివే రోజుల్లోనే 1941లో వ్యష్టి, క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ, సోషలిస్టు పార్టీ యువజన సంఘాల నాయకుడిగా పనిచేశారు. సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కరివేనలో జరిగిన రైతు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయ్యారు. సమాజ్‌వాదీ యువజన రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. గ్రామ పంచాయితీ కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తూ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1986 ఉద్యోగ విరమణ తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలో పలువురు నాయకులతో కలిసి రాజకీయాలకతీతంగా రాష్ట్ర కార్యాచరణ సమితిని స్థాపించారు. పోలవరం ప్రాజెక్టు సాధన కమిటీ చైర్మన్‌గా, రైతు కార్యాచరణ సమితి అధ్యక్షుడు, కృష్ణా డెల్టా పరిరక్షణ, పులిచింతల సాధన, కొల్లేరు అభయారణ్య పరిరక్షణ, రైతుల శ్రేయస్సు కోసం రైతు అధికార ప్రతినిధిగా, కోఆర్డినేటర్‌గా, గౌరవ అధ్యక్షుడిగా 46 ఏళ్లు అలుపెరగని పోరాటం చేశారు. 2018 అక్టోబర్‌ 2న రాష్ట్ర సర్వోదయ మండలి రాష్ట్రస్థాయిలో గాంధీ పురస్కారం అందుకున్నారు. పోలవరం ప్రాజెక్టు సాధన కోసం చేసిన కృషికి గుర్తింపుగా గోదావరి మాత అవార్డును అందుకున్నారు. 2020లో రాష్ట్ర సర్వోదయ మండలి, మహాత్మాగాంధీ స్మారక కమిటీ, జిల్లా సర్వోదయ మండలి సంయుక్తంగా అందించిన ఫ్రీడమ్‌ కింగ్‌ అవార్డును అందుకున్నారు. నలభై సంవత్సరాలుగా రైతు సమస్యలు, వ్యవసాయరంగం, పర్యావరణ పరిరక్షణ, కొల్లేరు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, డెల్టా ఆధునికీకరణ, విద్యా వినియోగదారుల సమస్యలు, పౌర సమస్యలపై పోరాటం చేశారు. ఆయన చేసిన సేవలను గుర్తించి విజయవాడలోని ముత్యాలంపాడులో అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో మంతెన వెంకట సూర్యనారాయణరాజును సత్కరించారు.

Updated Date - 2022-08-18T06:05:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising