ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రభుత్వమే పెద్ద దళారీ

ABN, First Publish Date - 2022-12-16T23:47:24+05:30

ధాన్యం కొనుగోలులో దళారుల వ్యవస్థను రూపుమాపడానికే నూతన విధానం తీసుకొచ్చినట్లు చెబుతున్న వైసీపీ ప్రభుత్వమే పెద్ద దళారీ అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తేమ శాతం రాకూడదని రైతులు ఆరబెట్టిన ధాన్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకృతి కంటే ప్రభుత్వమే నష్టం కలిగిస్తోంది

ధాన్యం కొనుగోలు తీరుపై రైతుల ఆగ్రహం

ఆకివీడు, డిసెంబరు 16: ధాన్యం కొనుగోలులో దళారుల వ్యవస్థను రూపుమాపడానికే నూతన విధానం తీసుకొచ్చినట్లు చెబుతున్న వైసీపీ ప్రభుత్వమే పెద్ద దళారీ అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం లాభం లేకుండా ఎటువంటి పని చేయదని రైతులు సూటిగా విమర్శిస్తున్నారు. ఏటా ప్రకృతి కారణంగా నష్టపోవడం సాధారణమని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ తీరుతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత పద్ధతిలో ధాన్యం కొనుగోలు చేయకుంటే దాళ్వా సాగుకు రైతులు వెనుకంజ వేయాల్సిందేనని చెబుతున్నారు. తేమ శాతం కారణంగా ధాన్యం ఆరబెట్టడానికి ఎకరాకు రూ.4వేలు అదనపు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. తేమ శాతం ఆర్బీకే, బఫర్‌ కాటా, మిల్లుల్లో వేర్వేరుగా ఎందుకు వస్తుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. మిల్లుకు ధాన్యం తోలిన తరువాత తేమశాతం 17 కంటే ఎంత ఎక్కువ చూపుతున్నారని, మరింత ఆరబెట్టడానికి ఖర్చు అదనం అవుతోందన్నారు. ఇదే విధానం కొనసాగితే రానున్న దాళ్వా చేయలేమంటున్నారు. వరి సాగు చేయడానికి కనీసం 100 ఎంఎల్‌ పురుగు మందు సీసా కొనలేని స్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లులు చుట్టూ తిరగడమే సరిపోతుందంటున్నారు. ఎవరు పండించిన పంట వారు విక్రయించుకుంటారు. కానీ వరి రైతు పంటను ప్రభుత్వం చెప్పినట్లు మాత్రమే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం, అధికారుల్లో మార్పు రాకపోతే రానున్న రోజుల్లో వ్యవసాయం చేయలేమని, రైతులకు అనువుగా నిర్ణయాలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఎకరాకు రూ.4వేల అదనపు ఖర్చు

తేమ శాతం తేడాలతో ఎకరాకు రూ.4వేలు అద నపు ఖర్చవుతోంది. రైతుల దగ్గర ధాన్యం మిల్లుకు తీసుకెళ్లడానికి డబ్బులు లేవు. 100 ఎంఎల్‌ పురుగు మందు బుడ్డి కొనడానికి కూడా డబ్బులు లేవు. అప్పులు కూడా ఎవరూ ఇవ్వడం లేదు. ఇదే పద్ధతి కొనసాగితే వచ్చే ఇక వరి సాగు చేయడం రైతులకు కష్టమే.

యిర్రింకి పెద్దిరాజు, కౌలురైతు, ఆకివీడు

బఫర్‌ కాటాలో వ్యత్యాసం

ఆర్బీకే, బఫర్‌ కాటా, మిల్లులో తేమశాతం వ్యత్యాసంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పాత పద్ధతిలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే వ్యవసాయం చేయడానికి రైతులు సిద్ధంగా ఉండరు. ఇప్ప టికే అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఎకరాకు ధాన్యం 20 బస్తాలు కూడా పండడంలేదు. పొలం పనులంటే కూలీలు రావడం లేదు.

రావూరి నాగేశ్వరరావు, కౌలురైతు ఆకివీడు

Updated Date - 2022-12-16T23:47:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising