ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎన్టీఆర్‌ శతజయంతిని వేడుకగా నిర్వహించాలి’

ABN, First Publish Date - 2022-05-26T06:15:06+05:30

తెలుగువారి ఖ్యాతిని చాటి చెప్పిన మహనీయుడు దివంగత ముఖ్య మంత్రి డాక్టర్‌ ఎన్టీ రామారావు అని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదవేగి, మే 25 : తెలుగువారి ఖ్యాతిని చాటి చెప్పిన మహనీయుడు దివంగత ముఖ్య మంత్రి డాక్టర్‌ ఎన్టీ రామారావు అని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. ఒంగో లులో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లపై దుగ్గిరా లలోని ఆయన స్వగృహంలో పార్టీ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రులంటే చులకనగా చూసే సమయంలో తెలుగువారి వాడి, వేడిని ఢిల్లీలో వినిపించిన నేత ఎన్టీఆర్‌ అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటిన ఎన్టీ ఆర్‌ శతజయంతిని వేడుకగా నిర్వహిం చాలన్నారు.  టీడీపీ  నాయకులు బొప్పన సుధాకర్‌, మాగంటి నారాయణప్రసాద్‌, తాతా సత్యనారాయణ, నేతల రవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

చింతమనేనిపై కేసు నమోదు..

పెదవేగి పోలీస్‌స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదైంది. ఎస్‌ఐ వైవీవీ.సత్యనారాయణ తెలిపిన వివరాలివి.. టీడీపీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా గత మంగళవారం పెదవేగి మండలం బి.సింగవరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో ప్రభాకర్‌ తనపై చెప్పడానికి వీల్లేని రీతిలో దుర్భాషలాడారని పేర్కొంటూ గ్రామ సర్పంచ్‌ పరసా సరస్వతి సోమవారం జరిగిన స్పందనలో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-05-26T06:15:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising