ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీక్ష బూని సాగరా..

ABN, First Publish Date - 2022-01-29T06:02:21+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అసంబద్ధ జీవోలను రద్దు చేయాలని రాష్ట్ర పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు రిలే దీక్షలు రెండో రోజూ కొనసాగించారు.

ఏలూరులో రిలే దీక్షలు నిర్వహిస్తున్న ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు

సమస్యలు పరిష్కరించే వరకు తలొగ్గమని స్పష్టీకరణ

ప్రభుత్వానికి బెదిరేది లేదంటూ హెచ్చరికలు


ఏలూరు కలెక్టరేట్‌, జనవరి 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అసంబద్ధ జీవోలను రద్దు చేయాలని రాష్ట్ర పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు రిలే దీక్షలు రెండో రోజూ కొనసాగించారు. ప్రభుత్వం తమను బెదిరించాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని, మా తడాఖా చూపిస్తా మంటూ గర్జించారు. సమ్మె దగ్గర పడు తున్న కొద్దీ ప్రభుత్వం నుంచి బెదిరింపులు ఎక్కువ కావడంతో కలెక్టరేట్‌ వద్ద తల పెట్టిన రిలే నిరాహార దీక్షల్లో ధిక్కార స్వరం వినిపించారు. నాలుగు రోజులపాటు జరిగే దీక్షలకు గురువారం పెద్ద సంఖ్య లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సంఘాల నేతలు మాట్లాడుతూ అశుతోష్‌మిశ్రా ఇచ్చిన పీఆర్సీ రిపోర్టును బయ ట పెట్టాలని, జనవరికి పాత జీతాన్ని ఇవ్వాలని, రాత్రిపూట ఇచ్చిన చీకటి జీవోలను రద్దు చేయా లని డిమాండ్‌ చేశారు. వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తామంటూ ఆవేశంగా మాట్లాడి ఓట్లు వేయించుకుని నేటివరకు రద్దు చేయకపోవడం అన్యా యమన్నారు. నేతలు ఆర్‌.ఎస్‌.హరనాథ్‌, చోడగిరి శ్రీనివాస్‌, కె.రమేష్‌కుమార్‌, లాం విద్యాసాగర్‌, దాసరి కృష్ణంరాజు, యు.పాండురంగారావు, కె.సత్యనారాయణ, యూటీఎఫ్‌ నాయ కుడు పోలిశెట్టి నరసింహారావు, పీఆర్టీయూ నాయకుడు పువ్వుల ఆంజనేయులు, డీపీఆర్టీయూ నాయకుడు పసుమర్తి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. టీచర్స్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ శిబిరానికి విచ్చేసి మాట్లాడుతూ అసంబద్ధ పీఆర్సీని రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. పోరాడి సాధించుకున్న హెచ్‌ఆర్‌ఏను స్లాబ్‌లు గా మార్చి ఇవ్వడం వల్ల ఉద్యోగులు చాలా నష్టపోతారన్నారు. దీక్షల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.




Updated Date - 2022-01-29T06:02:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising