ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వంపై ఉద్యోగులు రివర్స్‌

ABN, First Publish Date - 2022-01-23T05:35:45+05:30

రివర్స్‌ పీఆర్‌సీ మాకొద్దంటూ శని వారం రుస్తుంబాద ఏరియూ ఆసుపత్రి సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

రుస్తుంబాదలో నినాదాలు చేస్తున్న ఆసుపత్రి సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రివర్స్‌ పీఆర్‌సీ మాకొద్దంటూ ఆందోళన


నరసాపురం/పాలకోడేరు, జనవరి 22 : రివర్స్‌ పీఆర్‌సీ మాకొద్దంటూ శని వారం రుస్తుంబాద ఏరియూ ఆసుపత్రి సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అశుతోష్‌ మిశ్రా 11వ పీఆర్‌సీ నివేదికను బహిర్గతం చేసి అమలు చేయాలని, నష్టదాయకమైన జీవోలను వెంటనే రద్దు చేయాలని,  హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లు, సీసీఏలను పాత పద్ధతిలో సాగించాలని, ఫిట్‌మెంట్‌ 30 శాతానికి తగ్గకుండా ఇవ్వాలని, పీఆర్సీ అమలు ఏప్రిల్‌ 2020 నుంచి కాకుండా 2019 నుం చి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చీకటి జీవోలకు వ్యతిరేకిస్తూ మండల రెవెన్యూ సిబ్బంది శనివారం పాలకోడేరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్‌ కోరం రాజకిషోర్‌ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఉద్యోగులు వ్యతిరేకులు కాదని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న పీఆర్‌సీ జీవోను రద్దుచేయాలన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని ఉధృ తం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వైద్యులు రామనా యక్‌, రత్న కుమారి, విజయ, చంద్రలేఖ, గీతా, సిబ్బంది జ్యోతి, కృపావరం, భువన, శాంతి కుమారి, చిట్టిరాజ్యం, పద్మజ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-23T05:35:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising